Rashi Singh : అందగత్తెగా అలరించాలనుంది

ABN , Publish Date - Feb 27 , 2024 | 05:00 AM

‘హీరోయిన్‌ అవ్వాలనే నా చిన్ననాటి కలను టాలీవుడ్‌ నిజం చేసింది. అందుకు తెలుగు పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు గ్లామర్‌ పాత్రల్లో ప్రేక్షకులను అలరించాలనేదే నా లక్ష్యం’ అని...

Rashi Singh : అందగత్తెగా అలరించాలనుంది

‘హీరోయిన్‌ అవ్వాలనే నా చిన్ననాటి కలను టాలీవుడ్‌ నిజం చేసింది. అందుకు తెలుగు పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు గ్లామర్‌ పాత్రల్లో ప్రేక్షకులను అలరించాలనేదే నా లక్ష్యం’ అని హీరోయిన్‌ రాశి సింగ్‌ చెప్పారు. శివకందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించారు. మార్చి 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశి సింగ్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

మాది రాయ్‌పూర్‌. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఎయిర్‌హోస్టె్‌సగా ఉద్యోగం చేశాను. చిన్నప్పటి నుంచే హీరోయిన్‌ అవ్వాలనుకున్నాను. ‘ప్రేమ్‌కుమార్‌, పాపం పసివాడు’ సినిమాల్లో నటించాను. కథానాయికగా మంచి పాత్రలు దక్కుతున్నందుకు ఆనందంగా ఉంది. మున్ముందు వైవిధ్యమైన పాత్రలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక.

  • అనుకోకుండా ‘భూతద్ధం...’ ఆడిషన్‌కు వెళ్లి హీరోయిన్‌గా ఎంపికయ్యాను. మా దర్శకుడు తను రాసుకున్న పాత్రకు నేను సరైన ఎంపిక అని భావించారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు లక్ష్మి. తనో జర్నలిస్ట్‌. ఆధునిక భావాలున్న యువతిగా కనిపిస్తాను.

  • కథ విన్నప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. సస్పెన్స్‌, థ్రిల్‌, రొమాన్స్‌, పాటలు... ఇలా అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. కథ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ముగింపు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది.

  • శివ కందుకూరి గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో. ఈ సినిమా కోసం చాలా ఓపిగ్గా కష్టపడ్డారు. కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి అందరతో కలివిడిగా ఉన్నారు. పురుషోత్తంరాజ్‌ స్పష్టత ఉన్న దర్శకుడు. ఏ సన్నివేశం ఎలా తీయాలో, ఎవరి నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలో ఆయనకు అవగాహన ఉంది. సినిమాను ఓ అద్భుతంలా మలిచారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు కాబట్టే మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది.

  • కథానాయికగా వైవిధ్యమైన పాత్రలు పోషించాలనేది నా కోరిక. మంచి ఎమోషనల్‌ లవ్‌స్టోరీ చేయాలనుంది. కథ నచ్చితే గ్లామర్‌ పాత్రల్లో కనిపించడానికి సిద్ధమే. ప్రస్తుతం సుహా్‌సతో ‘ప్రసన్న వదనం’ అనే చిత్రం చేస్తున్నాను.

Updated Date - Feb 27 , 2024 | 05:00 AM