Santhosham : ఆహ్లాదకర వాతావరణంలో అవార్డుల కార్యక్రమం
ABN, Publish Date - Aug 18 , 2025 | 06:43 PM
సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ జె.ఆర్.సి.లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సంతోషం (Santhosham) సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ జె.ఆర్.సి.లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినిమా పెద్దలు, సినీ ప్రేమికుల మధ్య ఈ కార్యక్రమంలో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendrarao), లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ (Aswanidutt), మురళీ మోహన్ (Murali Mohan), ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ (Katragadda Prasad), డా. మోహన్ బాబు (Mohanbabu), విష్ణు మంచు (Vishnu Manchu), మాలశ్రీ (Malasri), బాబు మోహన్ (Babu Mohan) తదితరులు హాజరయ్యారు.
అవార్డుల ప్రదానోత్సవ వేదికపై వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా అవార్డ్ ప్రదానం చేశారు. అలాగే మెహన్ బాబు, విష్ణు మంచు... అశ్వినీ దత్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాకుండా మంచు మూడో తరం అవ్రామ్, తన తాత మోహన్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరితో పాటు కోట శ్రీనివాసరావు స్మారక అవార్డును బాబు మోహన్ అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కరభట్ల రవికుమార్ నూ ఘనంగా సత్కరించారు. అలానే అనంత శ్రీరామ్, మాలాశ్రీ కుమార్తె ఆరాధన రామ్ (కన్నడ), నిధిలం స్వామినాథన్ (తమిళం) తదితరులు మురళీ మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.
నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్రహాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యాదు వంశీ, మధుప్రియ, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెళ్ళ శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, 'రేవు' మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ స్వీకరించారు. అంతేకాకుండా ఓటిటి విభాగంలో సిరీస్ నైన్టీస్ (ETV Win), హాసన్ (నైన్టీస్), రోహన్ రాయ్ (నైన్టీస్), నటి జోర్దార్ సుజాత వంటి వారు మురళీ మోహన్ చేతుల మీదుగా సంతోషం అవార్డ్స్ అందుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు భార్య మృతి
Also Read: Mahavathar Narasimha: ఐదుగురు స్టార్ హీరోల పోటీ తట్టుకుని...