Vishal: 17 రాత్రుళ్ళతో పని పూర్తి...

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:13 PM

విశాల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'. ఆర్.బి. చౌదరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ ఇటీవల పూర్తయ్యింది.

Vishal Makutam Movie

హీరో విశాల్ (Vishal) తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మకుటం' (Makutam). ఈ సినిమాను సీనియర్ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి (RB Chowdary) నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ నుండి వస్తున్న 99వ సినిమా ఇది. చిత్రం ఏమంటే... రవి అరసు (Ravi Arasu) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొన్ని క్రియేటివ్ డిఫర్సెన్స్ కారణంగా మధ్యలో ఆగింది. దాంతో రవి స్థానంలో విశాల్ మెగా ఫోన్ పట్టుకుని దీనిని పూర్తి చేసే పని మొదలు పెట్టాడు. దాదాపు యాభై శాతం టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన క్లయిమాక్స్ చిత్రీకరణ ఇటీవల విశాల్ చిత్రీకరించాడు. 17 రోజుల పాటు నైట్ షూటింగ్ జరిపి, అనుకున్న విధంగా పతాక సన్నివేశాలను పూర్తి చేసినట్టు విశాల్ తెలిపాడు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను సైతం మేకర్స్ విడుదల చేశారు.


గతంలోనూ విశాల్ ఓసారి ఓ సారి మెగా ఫోన్ పడతానని ప్రకటించారు. ఆయన నటించిన 'డిటెక్టివ్' మూవీ సీక్వెల్ నుండి దర్శకుడు మిస్కన్ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే తప్పుకున్నారు. దాంతో తానే ఆ మూవీని డైరెక్ట్ చేస్తానని విశాల్ అన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా ఆ పని 'మకుటం' సినిమాకు చేయాల్సి వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా త్వరలో జనం ముందుకు రానుంది. దుషార విజయన్ (Dushara Vijayan), అంజలి (Anjali), తంబి రామయ్య, అర్జై తదితరులు కీలక పాత్రలు పోషించిన 'మకుటం' సినిమాకు జి.వి. ప్రకాశ్‌ కుమార్ (G V Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Action King Arjun: హత్యకు గురైన రచయిత కథతో 'మఫ్టీ పోలీస్'....

Also Read: NBK 111-Nayanatara: సామ్రాజ్యంలోకి రాణికి స్వాగతం.. నయన్‌ లుక్‌ అదిరింది..

Updated Date - Nov 18 , 2025 | 12:17 PM