Super Good Films: విశాల్ సరసన మరోసారి అంజలి...

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:54 PM

విశాల్, అంజలి ఈ యేడాది విడుదలైన 'మద గజ రాజా'లో కలిసి నటించారు. ఇప్పుడు విశాల్ 35వ చిత్రంలోనూ అంజలి నటిస్తోంది.

Vishal - Anjali

తమిళ స్టార్ హీరో విశాల్ (Vishal), అంజలి (Anjali) కలిసి నటించిన 'మద గజ రాజా' (Madha Gaja Raja) సినిమా కాస్తంత ఆలస్యంగా ఈ యేడాది పొంగల్ కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో విశాల్ కొత్త సినిమాలోనూ అంజలిని నాయికగా తీసుకున్నారు మేకర్స్. విశాల్ 35వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి (RB Chowdary) నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ (Super Good Films) లో ఇది 99వ సినిమా కావడం విశేషం. ఇందులో ఇప్పటికే దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే తంబి రామయ్య, అర్జై కీలక పాత్రలు చేస్తున్నారు. తాజాగా అంజలిని కూడా ఈ సినిమాకు ఎంపిక చేశారు.


WhatsApp Image 2025-08-22 at 12.01.04 PM.jpeg

జులైలో విశాల్ సినిమా ప్రారంభోత్సవం జరుగగా, ఆగస్ట్ 1న తొలి షెడ్యూల్ మొదలైంది. ఇప్పుడు సోమవారం నుండి ఊటీలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే అంజలి కూడా టీమ్ తో జత కలిసింది.. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'మద గజరాజా' ఫేమ్ రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అలానే విశాల్ మూవీ 'మార్క్ ఆంటోని'కి సంగీతం సమకూర్చిన జి.వి. ప్రకాశ్‌ కుమార్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. నాన్ స్టాప్ గా ఈ సినిమాను 45 రోజుల్లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి 'మదగజరాజా' సెంటిమెంట్ ను నిజం చేస్తూ... ఈ సినిమాతో కూడా విశాల్, అంజలి జోడీ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Also Read: Mana ShankaraVaraprasad Garu: మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు.. పండ‌క్కి వ‌చ్చేస్తున్నారు

Also Read: Anupama Parameswaran: ఇక్కడ 'పరదా', అక్కడ 'జానకీ...'

Updated Date - Aug 22 , 2025 | 12:54 PM

Vishal - Dhansika: తప్పకుండా ప్రేమ వివాహమే.. క్లారిటీ ఇచ్చిన హీరో

Vishal 35: సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుండి 99వ చిత్రం...

Vishal - Sai Dhanshika : పెళ్ళి వాయిదాకు కారణం అదేనా...

Anjali: 'గేమ్‌ ఛేంజర్‌' ఫెయిల్యూర్‌.. స్పందించిన తొలి వ్యక్తి..

Madha Gaja Raja Review: 12 ఏళ్ల తర్వాత విడుదలైన విశాల్‌ ‘మదగజరాజ’ ఎలా ఉందంటే..