సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pongal Movies: రాజా సాబ్ సీన్ ఎలా ఉండబోతోంది...

ABN, Publish Date - Nov 07 , 2025 | 03:39 PM

ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వర్సెస్ తమిళ సూపర్ స్టార్ విజయ్ గా సీన్ మారబోతోంది... ప్రభాస్ ఏమీ విజయ్ లా పాలిటిక్స్ లో లేరు... కానీ, పొంగల్ బరిలో వారిద్దరి సినిమాలు ఒకే రోజున ఢీ కొనబోవడం విశేషంగా మారింది...

The Raja Saab Vs Jana Nayagan

తెలుగునేలపై సినీబఫ్స్ లో అత్యధిక సంఖ్యాకుల చూపు సంక్రాంతి సీజన్ వైపే సాగుతోంది. ఈ సారి పొంగల్ బరిలో ప్రభాస్ (Prabhas), చిరంజీవి (Chirajeevi), రవితేజ (Raviteja), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తమ చిత్రాలతో దూకబోతున్నారు. వీరితో పాటు విజయ్ తన అనువాద సినిమాతో సంక్రాంతికి రానున్నారు. వీరిలో అందరికంటే ముందుగా ప్రభాస్ 'ద రాజా సాబ్' (The Raja Saab)గా జనవరి 9న వస్తున్నారు. అదే రోజున విజయ్ (Vijay) 'జననాయగన్' (Jana Nayagan) తెలుగునాట 'జననాయకుడు' పేరుతో అనువాదమై విడుదల కానుంది. మిగిలిన సినిమాల్లో అన్నీ సంక్రాంతిరోజునే వస్తుండగా, ప్రభాస్, విజయ్ సినిమాలు మాత్రమే ఓ ఐదు రోజులు ముందుగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగునాట విజయ్ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరకుతాయి. తమిళనాట ప్రభాస్ మూవీకి ఎన్ని సినిమాహాళ్ళు ఇస్తారు అన్న దానిపై చర్చ భలేగా సాగుతోంది.


వాస్తవానికి ఈ నాటి తెలుగు స్టార్స్ లో ఇతరుల కంటే మిన్నగా ప్రభాస్ చిత్రాలే తమిళనాట అలరించాయి. తెలుగులో భారీ విజయం సాధించిన ఇతర హీరోల సినిమాలు తమిళనాట అనువాద రూపంలో అంతగా అలరించలేక పోవడం గమనార్హం!. పైగా తెలుగు స్టార్స్ కు తమిళనేలపై అంతగా థియేటర్స్ దొరకడం లేదనీ ఓ టాక్ సాగుతోంది. ఇతరుల విషయం ఏమో కానీ, ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ కు కూడా తమిళనాట థియేటర్స్ దొరకవా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కు సైతం మంచి థియేటర్స్ లభించేలా చూడటానికి కొందరు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.


నిజానికి మన టాలీవుడ్ స్టార్స్ సినిమాలకు తమిళనాట సరైన థియేటర్స్ లభించడం లేదు. తమిళ టాప్ స్టార్స్ సినిమాలు రిలీజ్ కానప్పుడు మాత్రమే తమిళనేలపై మన తెలుగు స్టార్స్ మూవీస్ కు క్రేజ్ ఉన్న సినిమా హాళ్ళు లభిస్తున్నాయి. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ విజయ్ 'జననాయకన్' వస్తున్న నేపథ్యంలో మన ప్రభాస్ కు తమిళనాట సరైన థియేటర్స్ కష్టమే అని వినిపించింది. అయితే విజయ్ పాలిటిక్స్ కారణంగా అతని పోటీదారులు ప్రభాస్ సినిమా కోసం మంచి సినిమా హాళ్ళు పట్టే పనిలో ఉన్నట్టు సమాచారం. దాంతో తమిళనాట ప్రభాస్ 'ద రాజాసాబ్'పై కూడా ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంటుందనీ ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మరి జనవరి 9వ తేదీన ప్రభాస్ 'ద రాజాసాబ్', విజయ్ 'జననాయగన్'- ఇటు తెలుగునాట, అటు తమిళ నేలపై ఏ తీరున మురిపిస్తాయో చూడాలి.

Also Read: Happy Birthday: ఈ తరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

Also Read: Gouri G Kishan: నీ బరువెంత.. హీరోలను అడుగుతారా.. జర్నలిస్ట్ పై హీరోయిన్ ఫైర్

Updated Date - Nov 07 , 2025 | 03:47 PM