Gouri G Kishan: నీ బరువెంత.. హీరోలను అడుగుతారా.. జర్నలిస్ట్ పై హీరోయిన్ ఫైర్

ABN , Publish Date - Nov 07 , 2025 | 03:31 PM

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ప్రెస్ మీట్లకు అటెండ్ అవ్వాలంటేనే భయపడుతున్నారు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి.. ? వాటికి ఎలా సమాధానమిస్తే ఏం అవుతుంది అని కంగారుపడుతున్నారు.

Gouri G Kishan

Gouri G Kishan: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ప్రెస్ మీట్లకు అటెండ్ అవ్వాలంటేనే భయపడుతున్నారు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి.. ? వాటికి ఎలా సమాధానమిస్తే ఏం అవుతుంది అని కంగారుపడుతున్నారు. గతకొన్నిరోజులుగా ఇండస్ట్రీలో జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు సెలబ్రిటీలను చాలా అంటే చాలా ఇబ్బందిపెడుతున్నాయి. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ గౌరీ జీ కిషన్ (Gouri G Kishan) కి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.

గౌరీ జి కిషన్ , ఆదిత్య మాధవన్ జంటగా అబిన్ హారికరణ్ దర్శకత్వంలో అదుర్స్ అనే సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో హీరో, డైరెక్టర్, హీరోయిన్ పాల్గొన్నారు. ఇక సినిమా గురించి మాత్రమే ప్రశ్నలు అడగాల్సిన జర్నలిస్టులు అవి తప్ప మిగతావన్ని అడిగారు.

ముఖ్యంగా హీరోయిన్ గౌరీని ఒక జర్నలిస్ట్.. మీ బరువు ఎంత ఉంటుంది.. ? అని అడిగాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రశ్నలకు అంతకుముందు చాలామంది హీరోయిన్లు బదులు చెప్పినట్లు తెలిపాడు. ఇక ఈ ప్రశ్నకు ఖంగుతిన్న హీరోయిన్.. ఏ మాత్రం భయపడకుండా.. ' నా బరువుతో మీకేంటి పని.. నా బరువు గురించి తెలుసుకొని మీరేం చేస్తారు. సినిమాకు నా బరువు వలన నష్టమైనా వాటిల్లుతుందా.. ?' అని అడిగింది.

ఇక అలా మాట మాట పెరుగుతూ జర్నలిస్టులకు, హీరోయిన్ కు వాగ్వాదం చోటుచేసుకుంది. గౌరీ.. సదురు జర్నలిస్ట్ పై ఫైర్ అయ్యింది. ' సినిమా గురించి ప్రశ్నలు వేయండి.. నా నటన గురించి అడగండి చెప్తాను. ఇలాంటి తెలివితక్కువ ప్రశ్నలు వేయకండి.. ఇదే ప్రశ్న మీరు హీరోను అడగగలరా.. ? ప్రతి ఒక్కరి బాడీ షేప్ వేరుగా ఉంటుంది. మీకు నాకున్న హెల్త్ సమస్యలు తెలుసా.. ? అసలు సినిమా గురించి ఒక్క ప్రశ్న అయినా అడిగారా.. ఇది నిజమైన జర్నలిజం కాదు. ఇలాంటి ప్రశ్నలు వేసి మీ వృత్తిని అవమానపర్చకండి. అందరిలో ఒక్క అమ్మాయిని ఉన్నాను అనేగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు' అంటూ మండిపడింది.

గౌరీ - జర్నలిస్ట్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ గౌరీకి మద్దతు ప్రకటిస్తున్నారు. ఆడవారిని బాడీ షేమింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు అని స్టార్స్ అందరూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Happy Birthday: ఈ తరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

Jatadhara Movie: సుధీర్ బాబు.. జటాధర మూవీ రివ్యూ

Updated Date - Nov 07 , 2025 | 03:31 PM