Thalaivan Thalaivi: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మూవీ ఎప్పుడంటే...
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:54 PM
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించిన 'తలైవాన్ తలైవి' చిత్రం జూలై 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా పాత్రలను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు. అలాంటి సమయలో వచ్చిన 'మహారాజ' (Maharaja) చిత్రం ఆయన్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు... తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే. విజయ్ సేతుపతికి ఆ స్థాయి విజయం దక్కడం లేదు. ఈ మధ్య వచ్చిన 'ఏస్' (Ace) సినిమా తమిళ, తెలుగు భాషల్లో కూడా డిజాస్టర్ గా నిలిచింది.
విజయ్ సేతుపతికి అంటూ కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అతను ఏ పాత్ర చేసినా... అందులో ఒదిగిపోతాడనే పేరుంది. ఇక జయాపజయాలు అనేవి ఎవరి చేతిలోనూ ఉండవు. కొన్ని సార్లు కుదురుతుంది. కొన్ని సార్లు కుదరదు. అందుకే విజయ్ సేతుపతి అభిమానులు సైతం ఆయన నుండి మరో మంచి మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ సేతుపతి చిత్రం 'తలైవాన్ తలైవి' (Thalaivan Thalaivi) విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూలై 25న విడుదల కాబోతోంది. పాండిరాజ్ (Pandiraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ రూపంలో మేకర్స్ తెలిపారు. మధ్యతరగతి కుటుంబంలోని భార్యాభర్తలు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ హోటల్ నడుపుతారనేది ఈ టీజర్ ద్వారా అర్థమౌతోంది. ఇప్పటికే ఈ సినిమానుండి ఓ లిరికల్ వీడియో కూడా వచ్చింది. చిత్రం ఏమంటే... 'తలైవాన్ తలైవి'లో హోటల్ నిర్వాహకుడి భార్యగా నటిస్తున్న నిత్యామీనన్... ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'ఇడ్లీ కడై'లోనూ అదే తరహా పాత్రను పోషిస్తోంది. అందులోనూ ధనుష్ ఇడ్లీకొట్టును నిర్వహించే వ్యక్తిగా నటిస్తున్నాడు. మరి ఈ హోటల్ నేపథ్య చిత్రాలు జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ కు ఎలాంటి పేరు తెచ్చిపెడతాయో చూడాలి.
Also Read: Khushi Mukherjee: నేను ఇన్నర్ వేసుకున్నాను.. మీకు చూపించాలా..
Also Read: Kingdom: మరోసారి కింగ్ డమ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ