Kingdom: మరోసారి కింగ్ డమ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:46 PM
టాలీవుడ్ లో అసలు ఏమి జరుగుతుందో ఏవారికి అర్ధం కావడం లేదు. ఒక సినిమా రిలీజ్ కోసం.. ఇంకొక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది.
Kingdom: టాలీవుడ్ లో అసలు ఏమి జరుగుతుందో ఏవారికి అర్ధం కావడం లేదు. ఒక సినిమా రిలీజ్ కోసం.. ఇంకొక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. పోనీ ఆ సినిమా ఏమైనా అనుకున్న డేట్ కు వచ్చినా అంటే అది లేదు. ఈ రెండు సినిమాలు .. ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈపాటికే ఆ రెండు సినిమాలు ఏవి అనేవి అందరికీ అర్దమయ్యిపోయి ఉంటాయి. అవే ప్రేక్షకులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu), కింగ్డమ్ (Kingdom).
పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా ఐదేళ్లగా రిలీజ్ కు నోచుకోలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పవన్ రాజాకీయాలు. షూటింగ్ ఆలస్యం, డైరెక్టర్ మారడం.. డిస్టిబ్యూటర్స్ సమస్యలు ఇలా ఒకటి అని చెప్పలేం. అయితే అవన్నీ గతం. ఈసారి 2025 లో వీరమల్లు రావడం పక్కా అని మేకర్స్ చెప్పడంతో.. ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురుచూసారు. మార్చి అన్నారు.. అది పోయింది. మే అన్నారు.. అది పోయింది.. జూన్ అన్నారు అది కూడా పోయింది. ఇక చివరకు జూలై 24 న వీరమల్లు వస్తున్నాడు అని ఫైనల్ చేశారు.
వీరమల్లు వస్తున్నాడు అన్న ప్రతిసారి కింగ్డమ్ వెనక్కి పోతూనే ఉంది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ముచ్చటగా మూడు సార్లు కింగ్డమ్ వాయిదా పడింది. జూలై 24 న వీరమల్లు వస్తే.. జూలై 25 న కింగ్డమ్ వస్తుంది ఇద్దరికీ మధ్య గట్టి యుద్ధమే జరుగుతుంది అని ప్రేక్షకులు చాలా అంచనా వేశారు. కానీ, చివరికీ వీరమల్లునే గెలిచాడు. కింగ్డమ్ మళ్లీ వెనక్కి తగ్గింది. ఈ విషయాన్నీ నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.
'ఏం పోస్ట్ చేసినా.. కింగ్డమ్ మీద తీపి శాపాలు వస్తూనే ఉంటాయని తెలుసు. కానీ నన్ను నమ్మండి, మా బృందం మీకు భారీ స్క్రీన్ అనుభవాన్ని అందించడానికి 24 గంటలూ పనిచేస్తోంది.. నేను మీకు ఒక విషయం హామీ ఇవ్వగలను. ఈ సినిమా అందించే అనుభూతి, ఉత్సాహం మాత్రం మీరు ఊహించలేరు. మీ అందరికీ తెలుసు.. నేను ఏదైనా చెప్పాను అంటే.. అది ఎంతో నమ్మితే తప్ప చెప్పను. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా కూడా మీ క్రియేటివిటీ అంతా చూపిస్తారు నా మీద. కానీ, సినిమా చూసాక చెప్తున్నా.. రాసిపెట్టుకోండి.. విన్నర్ కింగ్డమే. గౌతమ్ స్టైల్ లో ఉండే పక్కా కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్ మెంట్ తో కలుద్దాం' అంటూ రాసుకొచ్చాడు. ఈ ఒక్క పోస్ట్ తో కింగ్డమ్ మరోసారి వీరమల్లు కోసం త్యాగం చేసాడని క్లారిటీ వచ్చింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కింగ్డమ్ ఆగస్టులో రిలీజ్ కానుందని తెలుస్తోంది.
Kajal Aggarwal: బీచ్ ఒడ్డున బికినీలో అక్కాచెల్లెళ్ల ముద్దులాట..