Khushi Mukherjee: నేను ఇన్నర్ వేసుకున్నాను.. మీకు చూపించాలా..

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:50 PM

సినిమా.. ఒక గ్లామర్ ఇండస్ట్రీ. ఇక్కడ గ్లామర్ చూపిస్తేనే నెగ్గుకురాగలరు. అయితే అది ఒక హద్దు వరకు ఉంటే.. ప్రేక్షకులు సైతం ప్రశంసిస్తారు.

Khushi Mukherjee

Kkhushi Mukherjee: సినిమా.. ఒక గ్లామర్ ఇండస్ట్రీ. ఇక్కడ గ్లామర్ చూపిస్తేనే నెగ్గుకురాగలరు. అయితే అది ఒక హద్దు వరకు ఉంటే.. ప్రేక్షకులు సైతం ప్రశంసిస్తారు. కానీ, హద్దుమీరితే మాత్రం ట్రోలింగ్ తప్పదు. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు.. గ్లామర్ చూపించడం సిద్దహస్తులు. సినిమాల్లోనే కాదు.. బయట ఎక్కడ కనిపించినా కూడా అందాలను ఆరబోయ్యాల్సిందే. కొంతమంది అయితే దాన్ని ప్రెస్టేజి కింద చూస్తారు. జిమ్ దగ్గరనుంచి హాస్పిటల్ వరకు ఎక్కడకు వెళ్లినా కూడా చిట్టిపొట్టి బట్టలు వేసుకొని.. క్లివేజ్ షో, థైస్ షో చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తూ ఉంటారు.


ఇక బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. టీవీ సీరియల్స్, షోస్ ద్వారా ఆమె కొంతమందికి మాత్రమే సుపరిచితురాలు. అయితే సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి మాత్రం ఆమె ఒక స్టార్. నిత్యం హాట్ హాట్ గా కనిపిస్తూ కెమెరాల కంటికి పనిచెప్పిస్తూ ఉంటుంది. వింత వింత డ్రెస్ లు వేసుకొని ఉర్ఫీ జావేద్ ఎలా అయితే ఫేమస్ అయ్యిందో.. ఖుషి కూడా అలానే ఫేమస్ అవ్వాలని ట్రై చేసింది. అయితే ఈమె.. అందాలను ఆరబోస్తూ డ్రెస్ లు వేసుకొని కనిపించేది. సగానికి పైగా శరీరం దుస్తుల బయటే ఉంచి .. దాన్నే గ్లామర్ పేరుతో చెప్పుకొచ్చి హైలైట్ అవ్వాలని ప్రయత్నిస్తుంది.


తాజాగా ఖుషి ముఖర్జీ హద్దు దాటింది. గ్లామర్ పేరుతో అసహ్యంగాఅనిపించే బట్టలు వేసుకొని ట్రోలింగ్ కు గురైంది. ఈమధ్యనే ఆమె ఒక బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ స్లీవ్ లెస్ క్రాప్ టాప్.. దానికిందా ఆమె ప్యాంట్ ధరించలేదు. ఇన్నర్ కూడా వేసుకోలేదు. ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని ఇబ్బంది పడుతూ కనిపించింది. అటు పక్క ఇటు పక్క ఆమె నడుము దగ్గర నుంచి కిందవరకూ శరీరం మొత్తం కనిపిస్తూ ఉంది. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్ సెన్స్ పై ఫైర్ అవుతున్నారు. అసలు ఇదేం డ్రెస్. అంత ఇబ్బంది పడుతూ చేతులు అడ్డుపెట్టాల్సిన అవసరం ఏముంది.. ? ఎందుకు వేసుకోవడం.. ఇది ఫ్యాషనా.. ఛీఛీ సిగ్గు లేదు ఇన్నర్ కూడా వేసుకోకుండా తిరుగుతున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ఇక సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై ఖుషి స్పందించింది. తాను ఇన్నర్ తో పాటు ట్రాన్స్ఫరెంట్ ప్యాంట్ కూడా వేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ' లోపల ఇన్నర్ వేసుకోలేదు అని మీకు చెప్పానా.. ? నేను ఇన్నర్ వేసుకున్నాను.. మీకు చూపించాలా.. ? నేను కింద ట్రాన్సఫరెంట్ ప్యాంట్ కూడా వేసుకున్నాను. నేను ఇబ్బంది పడుతున్నాను అని కామెంట్స్ చేస్తున్నారు. పాపులర్ అవ్వడానికి ఈ పనులు చేస్తున్నాను అని చెప్తున్నారు. నేనేమి ఇబ్బందిపడలేదు. ఇన్నర్ లేకుండా బయటకు వస్తారా అంటే.. నాకేమి ఎవరు పద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు. నా శరీరాన్ని ఎంతవరకు చూపించాలి.. ఏది దాచాలి అనేది నాకు బాగా తెలుసు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jun 30 , 2025 | 06:03 PM