Sir Madam Trailer: హమ్మయ్య.. డబ్బింగ్ మార్చరురా బాబు.. ట్రైలర్ ఇప్పుడు అదిరిపోయింది
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:58 PM
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్న చిత్రాల్లో తలైవన్ తలైవి ఒకటి.
Sir Madam Trailer: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆయన నటిస్తున్న చిత్రాల్లో తలైవన్ తలైవి ఒకటి. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నిత్యా మీనన్ (Nithya Menen) నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో 19 ఏ అని సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు రెండోసారి వీరిద్దరూ ఈ సినిమా కోసం జతకట్టారు. ఇక తలైవన్ తలైవి సినిమా తెలుగులో సార్ మేడమ్ పేరుతో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇప్పటికే సార్ మేడమ్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ప్రేక్షకులను విశేషంగా అక్కట్టుకున్నాయి. అయితే తెలుగులో ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకులను మెప్పించలేదు. స్టోరీ పరంగా బావుంది కానీ, విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కు డబ్బింగ్ అస్సలు సెట్ కాలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు అదేం డబ్బింగ్ రా బాబు అని నెత్తినోరు కొట్టుకున్నారు. ఇక ఒకసారి చేసిన తప్పే మళ్లీ చేస్తే తెలుగు ప్రేక్షకులు సహించరు అనుకున్నారో ఏమో మేకర్స్.. ఈసారి ట్రైలర్ లో డబ్బింగ్ ను మాత్రం సరిచేశారు.
తాజాగా సార్ మేడమ్ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. భార్యాభర్తల బంధం అంటే గొడవలు కచ్చితంగా ఉంటాయి. వాటిని దాటుకొని సాగినప్పుడే ఆ బంధం బలపడుతుంది.. పెళ్ళికి అనే పదానికి అర్ధం ఉంటుంది. ఈ సార్ మేడమ్ సినిమా ట్రైలర్ లో కూడా అదే చూపించారు. ఆకాశం( విజయ్ సేతుపతి) ఒక పరోటా మాస్టర్. హోటల్ నడుపుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇక రాణి (నిత్యామీనన్) ను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ, అందరి భార్యాభర్తల్లానే వీరిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ గొడవల వలన ఈ భార్యాభర్తల మధ్య వచ్చిన దూరం.. దగ్గరవుతోందా.. ? విడిపోవాలనుకున్న ఈ జంట కలుస్తుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ న్యాచురల్ ఆర్టిస్టులు. ట్రైలర్ లో వీరి నటన అద్భుతం. బయట భార్యాభర్తలు ఎలా ఉంటారో.. వారిలానే ఈ జంట కనిపించారు. భార్యను మహారాణిలా చూసుకొనే భర్త. భర్తకు అన్ని విషయాల్లో తోడుగా ఉండే భార్య.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్ ఫుల్ గా ఈ జంట కనిపిస్తున్నారు. జూలై 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Fahadh Faasil: కీ ప్యాడ్ ఫోన్ రూ. 10 లక్షలు.. ఎందుకంత స్పెషలో తెలుసా
Praveena Paruchuri: కొత్తపల్లిలో... స్నేహగుప్తా ఐటమ్ సాంగ్ వచ్చేసింది...