Fahadh Faasil: కీ ప్యాడ్ ఫోన్ రూ. 10 లక్షలు.. ఎందుకంత స్పెషలో తెలుసా

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:12 PM

సామాన్యులు వాడేలాంటి వస్తువులను సెలబ్రిటీలు ఉపయోగించరు.నేషనల్ , ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉపయోగిస్తారు. వారు వాడే బ్రాండ్స్ సామాన్యులు ఉపయోగించాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.

Fahadh Faasil

Fahadh Faasil: సామాన్యులు వాడేలాంటి వస్తువులను సెలబ్రిటీలు ఉపయోగించరు.నేషనల్ , ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉపయోగిస్తారు. వారు వాడే బ్రాండ్స్ సామాన్యులు ఉపయోగించాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. దుస్తులు దగ్గరనుంచి గాడ్జెట్స్, కార్ల వరకు సెలబ్రిటీలు వాడేవన్నీ లక్షలు, కోట్లలో ఉంటాయి. ఇక గాడ్జెట్స్ విషయానికొస్తే.. సెలబ్రిటీలను పక్కన పెడితే..సామాన్యులు కూడా ఐఫోన్ వాడేస్తున్నారు. కానీ, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) మాత్రం కీప్యాడ్ ఫోన్ వాడుతూ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదేంటి ఫహాద్ కీప్యాడ్ వాడితే ఏంటి.. ? ఐఫోన్ వాడితే ఏంటి.. ? అని తీసిపడేస్తే పొరబాటే.


ఫహాద్ వాడుతున్న ఆ కీప్యాడ్ ఫోన్ ధర ఎంతో తెలుసా.. ? అక్షరాలా రూ . 10 లక్షలు. ఏంమాట్లాడుతున్నారు.. కీప్యాడ్ ఫోన్ ధర ఎక్కడైనా రూ. 10 లక్షలు ఉంటుందా.. ? అని నవ్వకండి. నిజంగానే ఆ ఫోన్ ధర అంతే. అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందినది. వెర్టు అనే బ్రాండ్ కు చెందిన ఒక లగ్జరీ ఫోన్ అది. ఎందుకు దీనికంత ప్రత్యేకమైన ధర అంటే.. ఈ ఫోన్ ను పూర్తిగా చేతితో తయారుచేస్తారట. సెలబ్రిటీలకు, రాయల్టీ మెయింటైన్ చేసేవారికి, ఎక్కువ నికర ఆస్తులు ఉన్నవారికి మాత్రమే ఈ ఫోన్లను తయారుచేస్తారట. అంతేకాకుండా ఎంతో క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ తో తయారుచేస్తారట. అందుకే ఈ ఫోన్ కు అంత రేటు అని సమాచారం.


ప్రస్తుతం ఫహాద్ దగ్గర ఉన్నది ఒక మోడల్ మాత్రమే అని తెలుస్తోంది. దానికి మించిన మోడల్స్ ను కస్టమైజ్ చేయించుకోవచ్చని సమాచారం. ఏదిఏమైనా చూడడానికి చిన్నగా కనిపించే ఈ ఫోన్ కాస్ట్ చూస్తుంటే దిమ్మతిరిగిపోతుంది కదా. సెలబ్రిటీలు ఆ రేంజ్ లో ఖర్చు చేయకపోతే కష్టమే కదా అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఫహాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఫహాద్.. తెలుగులో పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం ఫహాద్ .. మారీసన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Aadi Saikumar: నాట్స్ లో 'శంబాల' టీజర్ ప్రదర్శన

Paradha Second Single: సతీ సహగమనం.. అనుపమ మంచి కాన్సెప్ట్ తోనే వస్తుందిగా

Updated Date - Jul 17 , 2025 | 04:12 PM