సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Antony: కాస్త ఆలస్యంగా 'భద్రకాళి' ఆగమనం

ABN, Publish Date - Aug 13 , 2025 | 09:35 AM

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం 'భద్రకాళి' కాస్తంత ఆలస్యంగా వస్తోంది. సెప్టెంబర్ 5న కాకుండా దీనిని అదే నెల 19న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.

Bhadrakaali Movie

ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని (Vijay Antony) ఇటీవల తెలుగువారి ముందుకు 'మార్గన్' (Margan) మూవీతో వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సందడి చేయకపోయినా... ఓటీటీలో వ్యూవర్స్ నుండి దీనికి మంచి అప్లాజ్ లభించింది. ఇదిలా ఉంటే... విజయ్ ఆంటోని ఇప్పుడు తన 25వ చిత్రం 'భద్రకాళి' (Bhadrakaali) మీద దృష్టి పెట్టాడు.


వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యమిచ్చే విజయ్ ఆంటోని 'భద్రకాళి'కి కూడా అలాంటి కథనే ఎంపిక చేసుకున్నాడు. రూ. 190 కోట్ల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకూ ఎన్నడూ కనిపించినంత స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ విజువల్స్, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి.

రగ్డడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'భద్రకాళి' నిజానికి సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. అదే రోజున శివ కార్తికేయన్ 'మదరాసి' కూడా జనం ముందుకు వస్తోంది. అలానే తెలుగులో తేజ సజ్జా 'మిరాయి', అనుష్క 'ఘాటి' చిత్రాలు అప్పుడే విడుదల అవనున్నాయి. ఈ నేపథ్యంలో 'భద్రకాళి' సినిమా విడుదలను సెప్టెంబర్ 19కి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. తెలుగులో 'మార్గన్' మూవీని విడుదల చేసిన ఏషియన్ సురేశ్‌ ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారానే 'భద్రకాళి' సైతం రిలీజ్ కానుంది. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో విజయ్ ఆంటోనీ తన సొంత బ్యానర్ లో నిర్మించగా, తెలుగులో దీనిని రామాంజనేయులు జవ్వాజీ విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Akkineni Venkat: ఆగిపోయిన డైరెక్షన్ డెబ్యూ మూవీ

Also Read: Wednesday Tv Movies: బుధ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Aug 13 , 2025 | 09:35 AM