సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Simbu: ‘అరసన్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ 

ABN, Publish Date - Nov 14 , 2025 | 09:13 AM

జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ శింబు  నటించే ‘అరసన్‌’ చిత్రం షూటింగ్‌ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది.


జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ (Vetrimaran) దర్శకత్వంలో కోలీవుడ్‌ మోస్ట్‌ బ్యాచిలర్‌ శింబు (Simbu)నటించే ‘అరసన్‌’ (Arasan) చిత్రం షూటింగ్‌ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉత్తర చెన్నై తరహాలో ప్రత్యేకంగా ఒక సెట్‌ నిర్మించారు. ఇందులో తొలి షెడ్యూల్‌ చిత్రీకరించనున్నారు. వి క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత థాను నిర్మించే ఈ చిత్రానికి  సంగీతం అనిరుధ్‌ రవిచందర్‌. ఈ ప్రాజెక్టు కోసం అనిరుధ్‌ - వెట్రిమారన్‌లు కలిసి పనిచేస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ప్రోమోకు సోషల్‌ మీడియాలో మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఈ మూవీ కథ, పాత్రల తీరు తెన్ను ‘వడ చెన్నై’ మూవీ తరహాలో ఉంటాయని దర్శకుడు వెల్లడించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇది కాకుండా శింబు నటించబోతున్న 50, 51 వ చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. 

ALSO READ: Buchi Babu: న‌క్క తోక‌ తొక్కిన‌.. బుచ్చిబాబు! పెద్ద.. స్కెచ్చే ఇది

Thalaivar173: రజినీ, క‌మ‌ల్ కాంబో సినిమా.. త‌ప్పుకున్న ద‌ర్శ‌కుడు

OTT: ఓటీటీలో.. తెగ చూసేస్తున్నారు! కాంతారా, లోకా స‌రికొత్త‌ రికార్డ్‌

Dude OTT: 'డ్యూడ్‌’.. ఓటీటీకి వ‌చ్చేసింది! ట్రోల‌ర్స్‌కు.. ఇక పండుగే పండుగ‌

Nagarjuna: కొండా సురేఖపై.. కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున

Updated Date - Nov 14 , 2025 | 09:35 AM