Nagarjuna: కొండా సురేఖపై.. కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున
ABN , Publish Date - Nov 13 , 2025 | 08:01 PM
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు వేసిన నటుడు అక్కినేని నాగార్జున, ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకున్నారు.
కొద్ది నెలల క్రితం మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అక్కినేని కుటుంబం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయంటూ నాగార్జున (Nagarjuna) నాంపల్లి కోర్టు (Nampally Court) లో పరువు నష్టం కేసు సైతం వేశారు. అయితే.. దాదాపు ఏడాదిగా నడుస్తున్న ఈ కేసుకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది.
ఇటీవలే రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ తాను గతంలో అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే చింతిస్తున్నాను” అని తన సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
కాగా .. గురువారం మరోసారి ఈ కేసు విచారణకు రాగా వాయిదా పడింది. సరిగ్గా ఇదే సమయంలో అక్కినేని నాగార్జున ఈ కేసును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. దాంతో మంత్రి క్షమాపణల అనంతరం.. నాగార్జున పెద్ద మనసుతో వ్యవహరించారని, దాంతో ఈ కేసు ముగిసిందని భావిస్తున్నారు. ఈ వివాదం చాలాకాలం కంటిన్యూ కాకుండా నాగార్జున గొప్ప మనసుతో వ్యవహరించారని ఆయన సడన్‌గా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.