OTT Hits: ఆర్మాక్స్‌ మీడియా జాబితాలో ఆ రెండు సినిమాలు..

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:01 PM

ఈ మధ్యన థియేటర్‌లో ప్రేక్షకులను అలరించి  వసూళ్ల వర్షం కురిపించిన సినిమాలు ఓటీటీ మాధ్యమాల్లోను మంచి ఆదరణ పొందుతున్నాయి

ఈ మధ్యన థియేటర్‌లో ప్రేక్షకులను అలరించి  వసూళ్ల వర్షం కురిపించిన సినిమాలు ఓటీటీ (OTT) మాధ్యమాల్లోను మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి సూపర్‌హిట్‌గా నిలిచిన ‘కాంతార చాప్టర్‌ 1’ (kantara 2) ‘కొత్తలోక’ (kotha lokah) ఓటీటీల్లోనూ అదే స్థాయిలో సక్సెస్ ఆయాయ్యి. ఓటీటీలో అత్యధిక వ్యూస్  సొంతం చేసుకున్న చిత్రాల జాబితాను ఆర్మాక్స్‌ మీడియా సంస్థ  వెల్లడించింది. వివిధ ఓటీటీ వేదికల్లో టాప్‌లో ఉన్న చిత్రాల లిస్ట్ ను విడుదల చేసింది. రెండు వారాలుగా నమోదైన వీక్షణల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు తెలిపింది.


ఆర్మాక్స్‌ ప్రకారం ‘కాంతార చాప్టర్‌ 1’ (Kantara Chapter 1) ఓటీటీలో 4.1 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకొని మొదటి స్థానంలో  నిలిచింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అక్టోబర్‌ 31 నుంచి ఈ సినిమా  స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంలో సంచలనం విజయం సాధించిన ‘కొత్తలోక: చాప్టర్‌ 1’ రెండో స్థానంలో నిలిచింది. జియో హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో 4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు ఆర్మాక్స్ తెలిపింది. 
జియో హాట్‌స్టార్‌లో 3.1 మిలియన్ల వ్యూస్‌తో ‘మిరాయ్‌’ మూడో స్థానంలో ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌ లో 2.4 మిలియన్ల వ్యూస్‌తో ‘ఇడ్లీ కొట్టు’ నాలుగో స్థానంలో నిలిచింది (Idli Kottu). టైగర్‌ ష్రాఫ్ నటించిన ‘బాఘీ 4’ (అమెజాన్‌ ప్రైమ్‌) 2 మిలియన్ల వీక్షణాలతో  ఐదో స్థానంలో ఉంది. 

Updated Date - Nov 13 , 2025 | 05:03 PM