సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saraswathi: వరలక్ష్మీ కొత్త ప్ర‌యోగం.. గుమ్మడికాయ కొట్టేశారు

ABN, Publish Date - Dec 30 , 2025 | 11:07 AM

వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ 'సరస్వతి' షూటింగ్ పూర్తయ్యింది. ప్రకాశ్‌ రాజ్, రాధిక ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Varalaxmi Sarathkumar

ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ఇప్పుడిప్పుడే తన రెక్కలు విప్పుతోంది. ఇంతవరకూ నటిగా, ఎంటర్ పెన్యూర్ గా ఉన్న వరలక్ష్మీ శరత్ కుమార్ మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. అంతేకాదు... తొలిసారి మెగాఫోన్ కూడా చేతిలోకి తీసుకుంది. సెప్టెంబర్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ 'దోస డైరీస్' పేరుతో 'సరస్వతి' (Saraswathi) అనే సినిమాను ప్రకటించింది. అంతేకాదు... సింగిల్ షెడ్యూల్ లో 30 రోజుల్లో ఇప్పుడు దాని షూటింగ్ నూ పూర్తి చేసింది.


'సరస్వతి' మూవీ టైటిల్ ను ప్రకటించినప్పుడే సినిమా రంగంలోని అందరి దృష్టినీ అది ఆకట్టుకుంది. హై కాన్సెస్ట్ థిల్లర్ మూవీగా రూపుదిద్దుకుంటున్న దీనిలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు ప్రకాశ్‌ రాజ్ (Prakash Raj), ప్రియమణి (Priyamani), రాధిక (Radhika) ఇతర ప్రధాన పాత్రలను ఇందులో పోషించారు. థమన్ ఎస్ (Thaman S) దీనికి సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే సినిమాటోగ్రఫీ సమకూర్చారు. ఈ సినిమాను తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్మిస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Also Read: Dhurandhar: మిల్కీ బ్యూటీకి క్రిస్టల్ డిసౌజా ప్రశంస!

Also Read: Actress Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య

Updated Date - Dec 30 , 2025 | 03:00 PM