Actress Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 29 , 2025 | 09:55 PM
తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ నటి నందిని (Nandini) (20) ఆత్మహత్యకు పాల్పడింది.
Actress Nandini: తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ నటి నందిని (Nandini) (20) ఆత్మహత్యకు పాల్పడింది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమె ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె బెడ్ పైనే పోలీసులు సూసైడ్ లెటర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోవాళ్ళు పెళ్లిపై ఒత్తిడి తీసుకురావడంతో తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. గత కొన్నిరోజులుగా నందిని వ్యక్తిగత సమస్యలతో పాటు డిప్రెషన్ తో కూడా బాధపడుతుందని సన్నిహితులు తెలిపారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
నందిని.. కన్నడ, తమిళ్ సీరియల్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా మొదట కన్నడలో మొదటి సీరియల్ తోనే స్టార్ గా మారింది. ఇక తమిళ్ లో గౌరీ అనే సీరియల్ ద్వారా నందిని ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్ లో ఆమె ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంది. ఈ విషాద వార్త సోషల్ మీడియాలో తీవ్ర దుఃఖాన్ని నింపింది, ఆమె ఆకస్మిక మరణం పట్ల అభిమానులు మరియు తోటి నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఆమె మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.