Dhurandhar: మిల్కీ బ్యూటీకి క్రిస్టల్ డిసౌజా ప్రశంస!
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:21 AM
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'దురంధర్' మూవీ ఈ యేడాది ఘన విజయాన్ని సాధించింది. ఈ ఇందులోని 'షరారత్'కు మొదట తమన్నాను అనుకుని ఆ తర్వాత క్రిస్టల్ డిసౌజాను తీసుకున్నామని డాన్స్ మాస్టర్ విజయ్ గంగూలీ చెప్పడం విశేషం.
ఈ యేడాది బాక్సాఫీస్ బరిలో ప్రభంజనం సృష్టించిన సినిమా 'దురంధర్' (Dhurandhar). కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల గ్రాస్ ను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా కథ, కథనాలతో పాటు ప్రేక్షకులను 'షరారత్' (Shararat) పాట కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆయేషా ఖాన్ (Ayesha Khan) తో కలిసి క్రిస్టల్ డిసౌజా నర్తించింది. ఆమె వేసిన స్టెప్స్ పాటకు బాగా హైప్ ను క్రియేట్ చేశాయి. 'దురంధర్' ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ పాట గురించే చర్చ చేస్తున్నారు. ఈ సూపర్ హిట్ సాంగ్ కు విజయ్ గంగూలీ కొరియోగ్రఫీ సమకూర్చారు. అతను ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ, 'దురంధర్' లోని షరారత్ సాంగ్కు మొదట తమన్నాను అనుకున్నానని, కానీ దర్శకుడు ఆదిత్య ధర్ ఎందుకో వద్దన్నారని చెప్పాడు. అందుకే క్రిస్టల్ డిసౌజాను తీసుకున్నట్టు విజయ్ గంగూలీ తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది.
ఈ మధ్య కాలంలో తమన్నా (Thamanna) సినిమాల్లో హీరోయిన్ గా కంటే... ఐటమ్ సాంగ్స్ ద్వారానే మంచి పేరు తెచ్చుకుంటోంది. ఆమె అలా స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలు సైతం మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో అందరూ మిల్కీ బ్యూటీ 'దురంధర్'లో ఛాన్స్ మిస్ అయిపోయిందే అని బాధపడుతున్నారు. అయితే తాజాగా ఈ పాటలో నర్తించిన క్రిస్టల్ మాత్రం తమన్నాకు కితాబిచ్చింది. ఆమె ఈ పాట విషయమై స్పందిస్తూ, 'షరారత్' సాంగ్ ఆర్టిస్టుల ఎంపిక విషయంలో తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాత్రం ఆయేషా ఖాన్ తో కలిసి డాన్స్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఒకవేళ నా బదులు తమన్నా ఈ పాట చేసి ఉంటే మరింత అందం వచ్చేది' అని తెలిపింది. తమన్నాకు క్రిస్టల్ ప్రశంసించిన... మిల్కీ బ్యూటీ అభిమానుల మనసుల్ని మరింత గాయపర్చేదిగా ఆమె కామెంట్ ఉంది. మరి ఈ విషయమై తమన్నా ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాలి.
Also Read: Actress Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
Also Read: Vijay- Rashmika: విజయ్ - రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..