Vanitha: అతను భవిష్యత్తులో మరో విజయ్ అవుతాడు..
ABN, Publish Date - Jul 12 , 2025 | 10:06 AM
విజయ్ సేతుపతి కుమారుడు సూర్యకి వనిత విజయ్ కుమార్ జోస్యం చెప్పింది. అతని కెరీర్ గురించి పలు వ్యాఖ్యలు చేసింది
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupati) కుమారుడు సూర్య విజయ్ (Surya) భవిష్యత్‌లో మరో విజయ్ అవుతాడని వనిత విజయకుమార్ (Vanitha Vijaykumar) జోస్యం చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో ‘మిసెస్ అండ్ మిస్టర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. వనిత కుమార్తె జోవిక నిర్మాత. శుక్రవారం సినిమా విడుదలైంది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..
‘విజయ్ సేతుపతి కుమారుడు సూర్య నటించిన ‘ఫీనిక్స్’ సినిమాపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. అనేక మంది సూర్యను హేళనగా మాట్లాడుతున్నారు. ‘నాలైౖయ తీర్పు’ సినిమాలో విజయ్‌కు కూడా ఇలానే జరిగింది. వాటన్నింటిని విజయ్ అధిగమించి దళపతిగా నిలిచారు. ఇపుడు సూర్య విజయ్ కూడా భవిష్యత్‌లో మరో విజయ్ అవుతాడు. నిర్మాతగా నా కుమార్తె కూడా సక్సెస్ సాధిస్తుంది. కెరీర్ ఆరంభంలో నయనతార, త్రిషలకు కూడా ఇదేపరిస్థితి ఎదురైంది. కాగా నా చిత్రం విడుదలకు ముందు ఒకే టెన్షన్. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. స్క్రిప్ట్ అలాంటిది. నేటి తరానికి ఖచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు.
ALSO READ:
Nayanthara: నయనతార చాలా కాస్ట్లీ.. ఒక్క సెకన్ కు ఎంతో తెలుసా
Satuarday Tv Movies: జూలై 12, శనివారం.. టీవీ తెలుగు సినిమాలివే
Virgin boys Review: బోల్డ్ కంటెంట్.. వర్జిన్ బాయ్స్ ఎలా ఉందంటే