Udhayanidhi: స్టాలిన్ మనవడి సినీ రంగ ప్రవేశం
ABN, Publish Date - Oct 09 , 2025 | 05:48 PM
తమిళ చిత్రసీమలోకి మరో వారసుడొస్తున్నాడు. తండ్రి సినిమాలకు బై.. బై... చెప్తుండటంతో.. ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పొలిటికల్ గానూ అతనిది బిగ్ ఫ్యామిలీ కావడంతో.. అందరి కళ్లన్నీ ఆ కుర్రాడి తెరంగేట్రంపైనే ఉన్నాయి.
సినిమా రంగంలో, రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా కామన్. ఇప్పటికే చాలా మంది ఆ బాటలో నడిచారు. అయితే... సినిమా, రాజకీయ రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చిన కుటుంబ కరుణానిధి ది. నాటక, సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణానిధి (Karunanidhi ) రాజకీయాల్లోనూ రాణించి, తమిళ నాడు సీఎం కాగా... ఆయన కుమారుడు స్టాలిన్ (Stalin) ఇప్పుడు సి.ఎం.గా ఉన్నాడు. ఇక స్టాలిన్ కుమారుడు ఉదయ్ నిధి (Udhayanidhi) కూడా హీరోగా వెలిగి.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నాడు. తండ్రి సీఎం అయితే ఇతను డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడీ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
స్టాలిన్ మనవడు, ఉదయనిధి కుమారుడైన ఇన్బనిధి (Inbanidhi) తన సినీ అరంగేట్రమ్ కు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈ యువకుడు ఫుట్‌బాల్ ఆటగాడిగా, రెడ్ జెయింట్ మూవీస్ సీఈవోగా ఇప్పటికే తన మార్క్ చూపించాడు. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) ఇన్బనిధిని హీరోగా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే... మారి సెల్వరాజ్ కు స్టాలిన్ కుటుంబంతో మంచి అనుబంధమే ఉంది.
ఉదయనిధి స్టాలిన్ నటించిన చివరి చిత్రం 'మామన్నన్'ను డైరెక్ట్ చేసింది మారి సెల్వరాజే. ఆ మూవీ పెద్ద విజయాన్ని సాధించి, ఉదయనిధి స్టాలిన్‌కు హీరోగా పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ఫిల్మ్‌గా మారింది. అందువల్ల తన కొడుకును హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఉదయనిధి... మారి సెల్వరాజ్ కు అప్పగించాడని అంటున్నారు. మరి నటుడిగా తండ్రి అడుగు జాడల్లో నడువబోతున్న ఇన్బనిధి రాబోయే రోజుల్లో రాజకీయ ప్రవేశం కూడా చేస్తాడేమో చూడాలి.
Read Also: Deepika Padukone: మరో వివాదంలో.. దీపిక! డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
Read Also: Akshay Kumar: సరికొత్త థ్రిల్లర్ గా 'హైవాన్'