Akshay Kumar: సరికొత్త థ్రిల్లర్ గా 'హైవాన్'

ABN , Publish Date - Oct 09 , 2025 | 02:12 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి నెగెటివ్ రోల్ చేస్తున్న చిత్రం 'హైవాన్'. ఈ సినిమా చివరి షెడ్యూల్ మొదలైంది. ప్రియదర్శన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

Akshay Kumar

పదిహేడేళ్ళ తర్వాత అక్షయ్ కుమార్ (Akshay Kumar), సైఫ్‌ అలీ ఖాన్ (Saif Ali Khan) కలిసి నటిస్తున్న సినిమా 'హైవాన్'. ఈ సినిమాను ప్రియదర్శన్ (Priyadarshan) డైరెక్షన్ లో కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ థ్రిల్లర్ మూవీలోని తన పాత్ర గురించి అక్షయ్ కుమార్ ఎగ్జయిట్ అవుతున్నారు. 'హైవాన్' మూవీతో ఓ గ్రేట్ జర్నీ చేస్తున్నానని, ఇందులోని పాత్ర తనను ఆశ్చర్యపరుస్తోందని, ఇలాంటి రోల్ చేసే అవకాశం ఇచ్చిన ప్రియదర్శన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అక్షయ్ కుమార్ ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ మూవీ సెట్ లో ఉంటే ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతోందని, సైఫ్ తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే... తన కెరీర్ లోనే అక్షయ్ కుమార్ ఫస్ట్ టైమ్ 'హైవాన్'లో నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 02:13 PM