Deepika Padukone: మరో వివాదంలో.. దీపిక! డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:15 PM
దీపిక పదుకొణె (Deepika Padukone) ఈమధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే.
దీపిక పదుకొణె (Deepika Padukone) ఈమధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు స్పిరిట్ సినిమా విషయంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఈ బ్యూటీ అటు తర్వాత ప్రపంచ స్థాయిలో మంచి విజయం సాధించిన కల్కి చిత్రం నుంచి కూడా తొలిగించబడి హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా దీపిక భర్తతో కలిసి చేసిన యాడ్‌తో మన దేశ వ్యాప్తంగా తీవ్రంగా విమర్శలు అందుకుంటుంది. నెటిజన్లు సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. భార్యాభర్తలు ఇద్దరు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), దీపిక (Deepika Padukone) కలిసి అబుదాబి టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఎక్స్‌పీరియన్స్ యాడ్‌లో నటించారు. ఇందులో అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అన్నట్టు ప్రమోట్ చేశారు. అయితే అంతవరకు బాగానే ఉంది గానీ ఆ తర్వాతే అసలు సమస్య వచ్చి పడింది. ఆ యాడ్‌లో ఆమె హిజాబ్ ధరించి షేక్ జాయెద్ గ్రాండ్ మజీదు (Sheikh Zayed Grand Mosque)లో కలియ తిరుగడం పెద్ద వివాదంగా మారి అంతకంతకు పెద్దదవుతోంది.
హిందూ అమ్మాయి అయి ఉండి డబ్బుల కోసం హిజాబ్ ధరిస్తావా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలెట్టారు. కావాలంటే నార్మల్ బట్టల్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. డబ్బుల కోసం ఏమైనా చేసేస్తావా అని దీపికాను ఏకి పారేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఓ వైపు గట్టిగానే ట్రోలింగ్ జరుగుతండగా ఇష్యూ జాతీయ స్థాయిలో వైరల్ అవుతుంది.