సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Rise of Kannada’s RRR : సక్సెస్ బాటలో ముగ్గురు శెట్టిలు

ABN, Publish Date - Oct 07 , 2025 | 06:06 PM

కన్నడ మూవీ రూట్ మార్చుకుంది. లోకల్ నుంచి గ్లోబల్ వైపు దూసుకెళ్తోంది. ముఖ్యంగా ముగ్గురు హీరోలు... ముందుకు నడిపిస్తున్న తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.

కన్నడ సినిమా (Kannada Cinema) కొత్త సక్సెస్ ఫార్ములాను క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీ అంతా ఇప్పుడు 'RRR' త్రయం చుట్టూ తిరుగుతోంది..RRR అంటే తెలుగు సినిమా కాదు.. కొత్తగా ఎమర్జ్ అయిన స్టార్లు రిషబ్ శెట్టి (Rishab Shetty) , రక్షిత్ శెట్టి (Rakshit Shetty) , రాజ్ బి. శెట్టి (Raj B. Shetty) ... వీరు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు ఇప్పుడు. కన్నడ సంస్కృతిని గ్లోబల్‌గా తీసుకెళ్తూ, లోకల్ రూట్స్‌తో విలక్షణ కథలు చెబుతున్నారు. అంతేకాదు ఈ ముగ్గురి అనుబంధం, సినిమారంగంలో ఒకరికొకరు మద్దతుగా నిలవడం ప్రస్తుతం కన్నడ చిత్రసీమకు కొత్త ఊపిరి పోస్తోంది.


కన్నడలో సెన్సేషన్ గా మారిన ఈ ముగ్గురి కలయికలో ఇప్పటికే ఓ సినిమా రూపొందింది. ‘గరుడ గమన వృషభ వాహన‌’ (Garuda Gamana Vrishabha Vahana) కు ముగ్గురూ పనిచేశారు. రక్షిత్ సమర్పణలో వచ్చిన ఈ మూవీలో రాజ్, రిషబ్ నటించారు. ఇక ‘కాంతార’ లో రాజ్ సంభాషణలు రాసి ఒక సన్నివేశాన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఇవి చిన్నవే అయినా.. వారి మధ్య సహకారం సినిమాలకు పెద్ద విజయాలను సాధించిపెట్టాయి.

ఎవరికి వారు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ.. ముగ్గురూ క్వాలిటీ కల్చర్ కి పెద్ద పీట వేస్తున్నారు. వీరు ఎంచుకునే కథలు కన్నడ రూట్స్ కి దగ్గర ఉంటూనే పాన్ ఇండియాని ఆకర్షిస్తున్నాయి. రిషబ్ శెట్టి ఇప్పటికే 'కాంతార' (Kantara), కాంతార ప్రీక్వెల్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆయన సినిమాలు కేవలం వినోదమే కాక, సాంస్కృతిక చిహ్నాలు కనిపిస్తాయి. రక్షిత్ శెట్టి నటుడు, దర్శకుడు, నిర్మాత. 777 చార్లీ (777 Charlie) , సప్త సాగరాలు దాటి ( Sapta Sagaralu Dhaati ) వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి.. రాజ్ బి. శెట్టి నటుడు, దర్శకుడు, రచయిత, కొరియోగ్రాఫర్. కన్నడ సాంస్కృతిక నేపథ్యాలతో సినిమాలు చేయడంలో ఆరితేరాడు. ఇటీవ‌ల సు ఫ్రమ్ సో (Su From So) సినిమాతో మంచి హిట్టు కొట్టారు. మొత్తంగా ముగ్గురూ కలసి కన్నడ సినిమాని పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తున్నారు.

Read Also: Pradeep Ranganathan: డైరెక్టర్ కమ్ హీరోగా ప్రదీప్ ర్యాంపేజ్

Read Also: Vyjayanthi Movies: చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా.. ఎవరి కోసం

Updated Date - Oct 07 , 2025 | 06:08 PM