Vyjayanthi Movies: చుక్కలు తెమ్మన్నా.. తెంచుకురానా.. ఎవరి కోసం

ABN , Publish Date - Oct 07 , 2025 | 05:50 PM

మహానటి సినిమా నుంచి వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) తన సత్తా చాటుతూ వస్తుంది.

Vyjayanthi Movies

Vyjayanthi Movies: మహానటి సినిమా నుంచి వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) తన సత్తా చాటుతూ వస్తుంది. కల్కి సినిమాతో టాప్ ప్రొడక్షన్ హౌస్ కు చేరుకుంది. ఒకపక్క స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఇంకోపక్క చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ మంచి కథలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. వైజయంతీ మూవీస్.. ఒక కొత్త దర్శకుడితో ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి సిద్దమయ్యిందని తెలుస్తోంది. కథ కూడా ఇప్పటికే అయ్యిందని సమాచారం.


ఫీమేల్ సెంట్రిక్ సినిమా కోసం చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్ ను వైజయంతీ మూవీస్ రిజిస్టర్ కూడా చేయించిందని తెలుస్తోంది. కథలో బాగా డెప్త్ ఉండడంతో ఈ సినిమాకు ఒక స్టార్ హీరోయిన్ అయితే బావుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. అయితే శ్రీలీలను కానీ, భాగ్యశ్రీ బోర్సేని కానీ తీసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం.. తండ్రీకోసం ఒక కూతురు ఏం చేసింది అనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.


ఇక ఈ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. ఇద్దరు హీరోయిన్లు ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం కష్టపడుతున్నవారే. ఎవరికి ఛాన్స్ దక్కినా వారి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. మహానటి లాంటి సినిమాతో కీర్తి సురేష్ ను వెనక్కి తిరగకుండా చేసిన బ్యానర్. ఇప్పుడు ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ కు ఇక తిరుగులేనట్టే. మరి ఆ చుక్క వీరిద్దరిలో ఎవరు అవుతారో చూడాలి.

Pradeep Ranganathan: డైరెక్టర్ కమ్ హీరోగా ప్రదీప్ ర్యాంపేజ్

Kamal - Rajani: కమల్‌ - రజనీ మల్టీస్టారర్‌ దర్శకుడు క్లారిటీ..

Updated Date - Oct 07 , 2025 | 05:50 PM