సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thalaivar173: అఫీషియల్.. కమల్ బ్యానర్ లో రజినీ.. డైరెక్టర్ ఎవరంటే

ABN, Publish Date - Nov 05 , 2025 | 08:30 PM

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) - కమల్ హాసన్ (Kamal Haasan) ఒక్కటి కాబోతున్నారు.

Thalaivar173

Thalaivar173: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) - కమల్ హాసన్ (Kamal Haasan) ఒక్కటి కాబోతున్నారు. ఏంటి ఇది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. మల్టీస్టారర్ కదా అని అనుకుంటున్నారా.. కాదు కాదు. దానికన్నా ముందే కమల్ బ్యానర్ లో రజినీ ఒక సినిమా చేయనున్నాడు. ఏంటి నిజమా.. అంటే అవును నిజమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజినీ.. ఇంకో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి తలైవర్ 173.

ఎప్పటి నుంచో రజినీ.. డైరెక్టర్ సుందర్ సి తో జత కట్టనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ తలైవర్ 173కి సుందర్ సి నే దర్శకత్వం వహిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను కమల్ హాసన్ తన బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇది కోలీవుడ్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్. ఒక స్టార్ హీరో సినిమాను.. ఇంకో స్టార్ హీరో నిర్మించడం..అందులోనూ వారిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం విశేషం.

ఇదే విషయాన్నీ కమల్ కూడా చెప్పుకొచ్చాడు. ఇది కేవలం కొలాబరేషన్ మాత్రమే కాదని, 5 దశాబ్దాల తమ స్నేహం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా సంక్రాంతి 2027 కి రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయనున్నారు. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు లెజెండ్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Raviteja: రవన్నా.. మారాలన్నా.. ఇలా అయితే కష్టం అన్నా

Mithramadali: రీ-ఎడిటింగ్‌తో ఓటీటీకి.. మిత్రమండలి! ఫ్లాప్ అయ్యాక తత్త్వం బోధపడింది

Updated Date - Nov 05 , 2025 | 08:30 PM