సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suresh Krishna: కమర్షియల్ సినిమాల్లో 'బాషా'... డివైన్ మూవీస్ లో 'అనంత'

ABN, Publish Date - Nov 13 , 2025 | 06:23 PM

ప్రముఖ దర్శకుడు సురేశ్‌ కృష్ణ తెరకెక్కించిన సినిమా 'అనంత'. పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రేమతత్త్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసినీ కీలక పాత్రలు పోషించారు.

Anantha movie

జగపతి బాబు (Jagapathi Babu), సుహాసిని (Suhasini) ప్రధాన పాత్రధారులుగా సురేష్ కృష్ణ (Suresh Krishna) తెరకెక్కించిన సినిమా 'అనంత' (Anantha). ఈ చిత్రాన్ని ఇన్నర్ వ్యూ బ్యానర్ లో గిరీష్‌ కృష్ణమూర్తి నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్వరలో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆడియో మరియు టీజర్ లాంచ్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సురేశ్‌ కృష్ణ మాట్లాడుతూ, 'బాబా గారి గురించి ఒక బయోపిక్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఆశ్రమం కి వెళ్ళాను. ఆయన నన్ను చూసి 'ఇంతకాలం ఎందుకు రాలేదు' అని అడిగారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించాను. అది నా మనసుని ఎంతో కదిలించింది. 2011లో ఆయన చనిపోయారు. తర్వాత నేను నా రొటీన్ లో పడిపోయాను. గత ఏడాది జూన్ లో ఒక కల వచ్చింది. ఆయన కలలోకి వచ్చి విభూదిని ఇచ్చారు. ఈ విషయం బాబా గారి దగ్గరికి నన్ను మొదటిసారి తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆయన మేము పుట్టపర్తి లో ఉన్నాం. మీ గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. ఒకరోజు గిరీష్ కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి బాబా గారి జీవితం పై సినిమా చేయాలని చెప్పారు. నేనే ఎందుకు ఈ సినిమా డైరెక్టర్ చేయాలని అడిగినప్పుడు.. బాబా గారు కలలోకి వచ్చి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని చెప్పారు అన్నారు. బాబాగారి శత జయంతి సందర్భంగా ఈ సినిమా చేయాలని కోరారు. కానీ ఆ సినిమాలో బాబాలాగా ఎవరూ నటించకూడదన్నారు. అప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ కూడా లేదు. అనుకోకుండా ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది. ఏదో భక్తి సినిమాలా కాదు. బాషా సినిమా లాంటి కమర్షియల్ స్క్రిప్ట్ వచ్చింది. జగపతిబాబు గారికి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయనకు చాలా నచ్చింది. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ చూసినప్పుడు సూపర్ గా అనిపించింది. సుహాసిని గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. అందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. దేవా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాట అద్భుతంగా వచ్చింది. కాశీ, చెన్నై, హైదరాబాద్, పుట్టపర్తి ఇలా అద్భుతమైన లొకేషన్స్ లో సినిమాని షూట్ చేశాం. ఇది మామూలు డివైన్ లాగా ఉండదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాబా గారికి ప్రేమే మతం. కమర్షియల్ సినిమాస్ లో 'బాషా' ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో డివైన్ ఫిలిమ్స్ లో అనంత అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత బాబా గారి ప్రేమ తత్వం మరింత మందికి చేరువవుతుంది'' అని అన్నారు.


తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, 'సాయిబాబా తనని నమ్మిన వారందరిని ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించారు. విద్య వైద్యం నీరు ఆయన పరిధిలో చేయగలిగినంత చేశారు. సురేష్ కృష్ణ ఎప్పుడు కూడా మంచి సినిమా తీస్తాడు. ఈ సినిమా కూడా అందరూ చూడాలని, చూస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు. సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ, 'ఇండియన్ సినిమా బిఫోర్ 'బాషా' ఆఫ్టర్ 'బాషా'. అలాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. సత్య సాయి బాబా గారి ప్రేమతత్త్వం అందరికీ పంచాలనే మనస్తత్వం ఉంటే తప్పితే ఇలాంటి సినిమా చేయలేం. మనిషికి భయం, భక్తి రెండు ఉండాలి. వాటిని తెలియచేసే ఈ సినిమా కమర్షియల్ గా కూడా అద్భుతమైన విజయం సాధించి మరిన్ని సినిమాలు రావడానికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరశంకర్, రాకేందు మౌళి, రామజోగయ్య శాస్త్రి, శ్రీరజనీ, చోటా కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Globe Trotter: జక్కన్న ప్లానింగా... మజాకా...

Also Read: OTT Hits: ఆర్మాక్స్‌ మీడియా జాబితాలో ఆ రెండు సినిమాలు..

Updated Date - Nov 13 , 2025 | 06:24 PM