Happy Birthday: ఫెస్టివల్స్ తో శ్రీలీలకు ఫెవికాల్ బంధం

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:50 PM

ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్ విక్టరీస్ ను పొందిన శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఈ యేడాది ఆమె హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. జూన్ 14న శ్రీలీల 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.

అందాల భామ శ్రీలీల (Sreeleela) టైమ్ ఇప్పుడు నడుస్తోంది. కన్నడ చిత్రసీమలో ఫస్ట్ బ్రేక్ వచ్చినా... నాలుగేళ్ళ క్రితం 'పెళ్ళిసందడి' (PellisandaD) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'అతను వచ్చాడు, చూశాడు, జయించాడు' అన్నట్టుగా శ్రీలీల తెలుగు సినిమా రంగంలోకి వచ్చింది, చూసింది, జయించింది! చిత్రం ఏమంటే.. ఆమె రాక ఓ పండగలా జరిగిపోయింది. శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao)... శ్రీలీల పరిచయం అయిన 'పెళ్ళి సందడి'కి దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించడమే కాకుండా ఓ కీలక పాత్రను పోషించారు. గతంలో ఎప్పుడూ చోటు చేసుకోని ఓ రేర్ ఇన్సిడెంట్ ఇది. ఆ సినిమా కమర్షియల్ గా ఆడలేదు కానీ శ్రీలీలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 2021 అక్టోబర్ 15న దసరా కానుకగా 'పెళ్ళిసందడి' విడుదలైంది.


విశేషం ఏమంటే... ఆ తర్వాత ఆమె నటించిన రెండో తెలుగు సినిమా 'థమాకా' (Dhamaka) 2022 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో శ్రీలీల తెలుగులో గ్రాండ్ విక్టరీని అందుకుంది. ఇక ఆమె మూడో సినిమా 'స్కంద' (Skanda) వినాయక చవితి కానుకగా జనం ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే దసరా కానుకగా అదే యేడాది వచ్చిన 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) నటిగానూ శ్రీలీలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బాలకృష్ణ, కాజల్ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీలీల తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన మరో తెలుగు సినిమా 'ఆదికేశవ' (Adikesava) అదే యేడాది దీపావళి కానుకగా విడుదలైంది. దీని తర్వాత వచ్చిన 'ఎక్స్ ట్రా' మాత్రమే ఏ పండగ లేకుండా డిసెంబర్ 8న రిలీజైంది. ఆ తర్వాత మహేశ్ బాబు సరసన శ్రీలీల నటించిన 'గుంటూరు కారం' (Guntur Karam) కూడా సంక్రాంతి కానుకగానే విడులైంది. డిసెంబర్ లోనే విడుదలై శ్రీలీల మరో తెలుగు సినిమా 'పుష్ప -2' (Pushpa -2). ఇది కూడా ఏ పండగ లేకుండానే వచ్చింది. అయితే ఇందులో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేసింది. జాతీయ స్థాయిలో శ్రీలీల పేరు ఈ సినిమాతో మారుమ్రోగిపోయింది.


ఈ యేడాది శ్రీలీల నటించి తెలుగు సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక్కటే వచ్చింది. అదే 'రాబిన్ హుడ్' (Robinhood). నితిన్ సరసన 'ఎక్స్ ట్రా' తర్వాత ఆమె నటించిన రెండో సినిమా ఇది. ఈ సినిమా కూడా ఉగాది పండగ సందర్భంగా విడుదలైంది. ఈ రకంగా శ్రీలీల తెలుగు సినిమాలకు... పండగలకు ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించేలా అవి జనం ముందుకు వచ్చాయి. ఇక గడిచిన ఆరేళ్లలో శ్రీలీల కన్నడలోనూ మూడు నాలుగు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్‌ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagath Singh) చిత్రంలోనూ, రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' (Mass Jathara) లోనూ, అఖిల్ 'లెనిన్'లోనూ శ్రీలీల నటిస్తోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా రాలేదు కానీ 'మాస్ జాతర' వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న రాబోతోంది. అలానే గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి సరసన 'జూనియర్' (Junior) మూవీలోనూ శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో జూలై 18న విడుదల కాబోతోంది. హిందీలోనూ శ్రీలీల ఈ యేడాది అడుగు పెడుతోంది. ఆమె తొలి హిందీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరో... ఈ యేడాది దీపావళి కానుకగా ఇది జనం ముందుకు రాబోతోంది. ఇప్పటికీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అలానే సైఫ్‌ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం అలీఖాన్ సరసన కూడా శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. జూన్ 14 (శనివారం) శ్రీలీల పుట్టిన రోజు. 24 సంవత్సారాలు పూర్తి చేసుకుని శ్రీలీల 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆమె మూవీస్ లైన్ అప్ చూస్తుంటే.... పాన్ ఇండియా స్టార్ గా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

Also Read: Nadigar Sangam: నడిగర్‌ సంఘం పేరుతో  రూ.40 లక్షల మోసం!

Also Read: Nagarjuna: అఖిల్‌ పెళ్లి రిసెప్షన్ లో టబు .. పిన్ని అంటూ ఫన్నీ మీమ్స్‌ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 14 , 2025 | 03:50 PM