Nagarjuna: అఖిల్ పెళ్లి రిసెప్షన్ లో టబు .. పిన్ని అంటూ ఫన్నీ మీమ్స్
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:12 PM
‘నాన్నోయ్ పిన్ని వచ్చిందీ’ అంటూ అతడు చెప్పే డైలాగ్, ఆ సీన్ విపరీతంగా పేలింది. ఇప్పుడు అదే డైలాగ్‌ను మీమర్స్ ఓ యాంగిల్‌లో వైరల్ చేస్తున్నారు. అఖిల్ (Akhil) పెళ్లికి ఆ సన్నివేశాన్ని లింక్ చేసి మీమ్స్ క్రియేట్ చేశారు.
వెంకటేశ్ హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో బుల్లిరాజ పాత్రకు, అతని డైలాగ్‌లు సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొట్టాయో చూశాం. 'కొరికేత్తాను.. కొరికేత్తాను' అంటూ చిచ్చరపిడుగు రేవంత్ ఆన్ స్క్రీన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక ‘నాన్నోయ్ పిన్ని వచ్చిందీ’ అంటూ అతడు చెప్పే డైలాగ్, ఆ సీన్ విపరీతంగా పేలింది. ఇప్పుడు అదే డైలాగ్‌ను మీమర్స్ ఓ యాంగిల్‌లో వైరల్ చేస్తున్నారు. అఖిల్ (Akhil) పెళ్లికి ఆ సన్నివేశాన్ని లింక్ చేసి మీమ్స్ క్రియేట్ చేశారు.
అక్కినేని అఖిల్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసి జైనాబ్ రవ్‌ద్జీతో ఘనంగా వివాహం జరిగింది. తదుపరి అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ, రాజకీయ కుటుంబ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందులో బాలీవుడ్ నటి టబు (Tabu) కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు మీమర్స్ ఈ ఫొటోలపై తమ క్రియేటివిటీని చూపించారు. నెటిజన్లు బుల్లిరాజు డైలాగ్‌ను రీమిక్స్ చేసి ‘నాన్నోయ్ పిన్ని వచ్చిందీ’ అని అఖిల్ తన తండ్రి అక్కినేని నాగార్జునతో చెబుతున్నట్టు.. ఎవరని అడగ్గా ‘నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్’ అని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగార్జున, టబు కలిసి ఉన్న ఫోటోలతో ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. (Memes on Tabu)
నాగార్జున, టబు ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆన్ స్ర్కీన్ కెమిస్ర్టీతో అలరించిన వీరిద్దరూ.. ఆఫ్ స్ర్కీన్ లోనూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. నాగార్జున సతీమణి అమలకు కూడా టబుతో స్నేహం ఉంది.