Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయలుగా రిషబ్ శెట్టి
ABN, Publish Date - Jul 15 , 2025 | 06:07 PM
ఏ ముహూర్తాన 'కాంతార' మొదలుపెట్టాడో కానీ.. రిషబ్ శెట్టి జాతకమే మారిపోయింది. వరుసబెట్టి చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నాడు. ఆల్రెడీ సెట్స్ మీద సెన్సేషన్స్ ఉండగానే మరో బ్లాక్ బస్టర్ పై కన్నేశాడు.
'కాంతార' (Kantara) సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన కన్నడ హీరో రిషబ్ శెట్టి ( Rishab Shetty) సంచలనాలకు వేదికగా మారుతున్నాడు. ఇప్పటికే 'కాంతార' ప్రీక్వెల్ (Kantara Prequel ), 'జై హనుమాన్' (Jai Hanuman) మూవీలతో కొత్త రికార్డులు నెలకొల్పడానికి సిద్ధమైన ఈ హీరో... మరో భారీ ప్రాజెక్టును భుజాన వేసుకుంటున్నాడు. విజయనగర సామ్రాజ్యధినేత శ్రీకృష్ణదేవరాయల జీవితం ఆధారంగా రూపుదిద్దుకోబోతున్న ఓ భారీ పీరియాడిక్ డ్రామాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే క్రేజీ న్యూస్ అనుకుంటే... దీని మేకర్స్ గురించిన విషయాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
శ్రీకృష్ణదేవరాయల జీవితం ఆధారంగా తెరకెక్కే ఈ భారీ ప్రాజెక్ట్‌ను 'లగాన్, జోధా అక్బర్' వంటి ఐకానిక్ చిత్రాల దర్శకుడు ఆశుతోష్ గోవరికర్ (Ashutosh Gowariker) తెరకెక్కించబోతున్నాడట. మరోవైపు ఈ సినిమాను '83, తలైవి' వంటి హిట్‌లను నిర్మించిన విష్ణువర్ధన్ ఇందూరి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు తెలియడంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమన్న అంచనాలు అప్పుడే వెలువడుతున్నాయి. విజయనగర సామ్రాజ్యంను రీక్రియేట్ చేయడానికి గ్రాండియర్, లావిష్ సెట్స్ వేయబోతున్నట్టు ఇందూరి చెబుతున్నారు.
1509 -1529 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కృష్ణదేవరాయలు, ‘ఆంధ్ర భోజుడు’, ‘కర్ణాటక రత్న’ వంటి బిరుదులతో భారత చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన సుపరిపాలన, సాహిత్య ప్రోత్సాహం, యుద్ధ వీరత్వం ఈ సినిమా ద్వారా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కృతం కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీ, సౌత్ ఇండియన్ స్టార్స్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా రూపొందనుంది.
ఇవేకాక ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తో చేస్తున్న 'జై హనుమాన్' లో రామ భక్తుడిగా రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Maharaj) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. 2027లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అంతేకాక బంకించంద్ర ఛటర్జీ (Bankim Chandra Chatterjee) నవల 'ఆనందమఠ్' ఆధారంగా రూపొందుతున్న '1770' మూవీలో రిషబ్ నటించనున్నారు. అశ్విన్ గంగరాజు (Ashwin Gangaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు ఐదు హిస్టారికల్ మూవీస్ చేస్తూ సరికొత్త వండర్స్ ను క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు రిషబ్ శెట్టి.
Read Also: Jani Master Reentry: మళ్లీ ఫామ్ లోకి జానీ మాస్టర్.. ఆ సినిమాతో తెలుగులో రీఎంట్రీ
Read Also: Ntr- Trivikram: తారక్ - త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ అప్‌డేట్ ఇదే