Vilaayath Budha: 'పుష్ప'ను గుర్తు చేస్తున్న.. పృథ్వీరాజ్ కొత్త సినిమా! ఓ రేంజ్‌లో ట్రోలింగ్

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:22 PM

పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం 'విలయాత్ బుద్థ' ట్రైలర్ విడుదల కాగానే అల్లు అర్జున్ 'పుష్ప'తో దాన్ని నెటిజన్స్ పోల్చడం మొదలు పెట్టారు. హీరోలు ఇద్దరూ ఎర్ర చందనం స్మగ్లర్స్ అన్నది ఒక్కటే కామన్ పాయింట్ అని పృథ్వీరాజ్ సినిమా కథ వేరని కొందరు చెబుతున్నారు.

Vilaayath Budha Movie

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ (Prudhiviraj Sukumaran) మంచి దర్శకుడు కూడా అతను తెరకెక్కించిన సినిమాలు మంచి విజయాన్ని సాధించడమే కాదు... అతనికి మేకర్స్ గానూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గతంలో తెలుగు సినిమాల్లో మెరుపులా మెరిసన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు మహేశ్ బాబు (Mahesbabu), రాజమౌళి (Rajamouli) మాగ్నమ్ ఓపస్ మూవీ 'వారణాసి' (Vaaranaasi) లో విలన్ గా నటిస్తుండటంతో అందరి దృష్టి అతని మీద, అతని కొత్త సినిమాల మీద పడింది. నిజానికి కొంతకాలంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడమో రీమేక్ కావడమో జరుగుతోంది. కానీ ఈ నెల 21న విడుదల కాబోతున్న మలయాళ చిత్రం 'విలాయత్ బుద్థ' (Vilaayath Budha) మాత్రం తెలుగులో డబ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు. ఎందుకంటే... తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అచ్చు అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' (Pushpa) సినిమాలానే ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో విశేషంగా జరుగుతోంది.


నిజానికి 'విలాయత్ బుద్థ' సినిమాకు మూలం జి.ఆర్. ఇందు గోపాలన్ రాసిన నవల. దీనిని 'అయ్యప్పనుం కోషియం' డైరెక్టర్ సాచి సినిమాగా తీయాలని అనుకున్నాడు. కానీ ఆయన చనిపోవడంతో ఆ బాధ్యతను అతని అసిస్టెంట్ జయన్ నంబియార్ భుజానికి ఎత్తుకున్నాడు. పృథ్వీరాజ్ లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 21న మూవీ జనం ముందుకు రావాల్సి ఉండగా... మూడు రోజుల క్రితం దీని ట్రైలర్ ను విడుదల చేశారు. దాన్ని చూసిన వాళ్లంతా నోరెళ్ళబెడుతున్నారు. 'విలాయత్ బుద్థ' చూస్తుంటే 'పుష్ప' మూవీనే గుర్తొస్తోందని అంటున్నారు. ఇందులో హీరో పేరు డబుల్ మోహన్. అతనో గంధపు చెక్కల స్మగ్లర్. అతని కంట్లో ఏదైనా పడిందంటే ఖచ్చితంగా స్మగుల్ అవుతుంది. అలాంటి సమయంలో ఓ ఇంటిలోని పెరడులో గంధపు చెట్టు మాయం అవుతుంది. అది డబుల్ మోహన్ పనే అని అందరూ అనుకుంటారు. అయితే... తనపై పడిన నిందను అతను ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమా కథ అని అంటున్నారు. 'విలాయత్ బుద్థ'కు 'పుష్ప'కు సంబంధం లేదని, రెండు సినిమాల్లో హీరోలు ఎర్ర చందనం స్మగ్లర్స్ కావడం అనే పాయింట్ మాత్రమే కామన్ అని సర్థి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా... శుక్రవారం 'విలాయత్ బుద్థ' విడుదలైతే తప్పితే... 'పుష్ప'కు దీనికి ఉన్న సారూప్యం తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్!

Also Read: Ravi Basur: ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా.. రవి బసూర్ సీక్రెట్స్‌

Also Read: Vishal: 17 రాత్రుళ్ళతో పని పూర్తి...

Updated Date - Nov 18 , 2025 | 03:44 PM