Vijay Vs Shiva Karthikeyan: 'జన నాయగన్' తో 'పరాశక్తి' పోటీ
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:14 PM
కోలీవుడ్ పొంగల్ పోరు ఈ సారి మరింత రసవత్తరంగా మారబోతోందా? ఎవరూ ఊహించని ప్రాజెక్టులు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయా? ఒకరు ఆల్రెడీ రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేయగా.. మరొకరు అదే డేట్ కు వస్తున్నట్టు చెప్పడంతో ఇప్పుడు అభిమానుల మధ్య క్యూరియాసిటీ పెరిగిపోయింది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) కెరీర్‌లో చివరి సినిమాగా రాబోతోంది 'జన నాయగన్' (Jana Nayagan). హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్ లో గుర్తుండిపోయేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతుండగా... అభిమానులు కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన గ్లింప్స్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేసింది. అంత బాగానే ఉంది కానీ.. ఇక్కడే వారికి పెద్ద ప్రాబ్లమ్ వచ్చిపడింది.
'జన నాయగన్' మూవీని వచ్చే ఏడాది జనవరి 9న పొంగల్ సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. కానీ అదే సమయంలో మరో సినిమా పోటీకి వచ్చేలా ఉంది. కోలీవుడ్ లో చిన్న దళపతిగా పిలిపించుకుంటున్న శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న 'పరాశక్తి' (Parasakthi ) కూడా ఈ పండుగ సీజన్‌లో విడుదల కాబోతోందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇవన్నీ వట్టి ఊహాగానాలే అనుకుంటున్న సమయంలో దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) చేసిన కామెంట్స్ తో ఉత్కంఠ నెలకొంది.
రీసెంట్ గా ఓ ఈవెంట్‌లో సుధా కొంగరను 'జననాయగన్, పరాశక్తి' సినిమాల పొంగల్ క్లాష్ గురించి అడిగారు. అయితే ఆమె స్పష్టమైన సమాధానం చెప్పకుండా, డొంక తిరుగుడుగా 'పరాశక్తి'కి పొంగల్ కు వస్తున్న విషయం తనకు తెలియదని, ఆ విషయాన్ని నిర్మాత చూసుకుంటార'ని బదులిచ్చింది. అవునో కాదో చెప్పకుండా ఇలా ఆమె మాట్లాడేసరికీ చాలామందికి 'పరాశక్తి' పొంగల్ బరిలో దిగబోతోందనే భావనకు వచ్చేశారు. ఇప్పటి నుండీ ఈ రకమైన ఊహాగానాలకు 'పరాశక్తి' టీమ్ ఎందుకు అవకాశం కల్పిస్తుందో తెలియదు. ఏదేమైనా... ప్రతి పొంగల్ కూ రెండు మూడు భారీ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడటం సహజమే. ఆ రకంగా చూసినప్పుడు 'జన నాయగన్, పరాశక్తి' మాత్రమే కాకుండా మరో సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Read Also: Mega 157: లీక్ వీడియోలపై స్పందించిన మేకర్స్..
Read Also: Athadu Movie OST: ఊపేస్తోన్న 'అతడు' ఒరిజినల్ ట్రాక్స్