Athadu Movie OST:ఊపేస్తోన్న 'అతడు' ఒరిజినల్ ట్రాక్స్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:22 PM

రీ-రిలీజ్ లోనూ రికార్డుల మోత మోగించొచ్చని ప్రూవ్ చేసిన సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు మ‌రో రికార్డ్ కు రెడీ అవుతున్నాడు. 20 ఏళ్ల క్రితం వ‌చ్చి క‌ల్ట్ మూవీగా మారిపోయిన 'అతడు' కొత్త హంగుల‌తో మరోసారి జనం ముందుకు రాబోతోంది.

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) న‌టించిన బ్లాక్‌బస్టర్ 'అతడు' (Athadu) వచ్చి 20 ఏళ్లు అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో మొదట సోసోగా ఆడినా టీవీ, ఓటీటీలో ఇప్పటికీ దుమ్మురేపుతోంది. తెలుగు యాక్షన్ డ్రామాలలో క్రేజియెస్ట్ మూవీల్లో ఇది ఒకటి. అంతేకాదు.. సినీ ప్రేమికులలో దీనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి మూవీ ఇప్పుడు 4కె రిజల్యూషన్ (4K resolution), డాల్బీ డిజిటల్ సౌండ్‌ (Dolby Digital audio) తో థియేటర్లలో ఆగస్ట్ 9న రీ-రిలీజ్ కాబోతోంది. మహేష్ ఫ్యాన్స్ ఈ మూమెంట్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. దాని కంటే ముందే మ‌రో గిఫ్ట్ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్.


'అతడు' సినిమా విడుదలైనప్పుడు పాట‌లు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. మెలోడీ బ్రహ్మా మణిశర్మ (Mani Sharma) కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవ‌రేట్. అయితే తాజాగా ఈ మూవీ OST (Original Sound Track) రిలీజ్ అయ్యింది. ఒకే వీడియోలో మొత్తం 20 ఒరిజినల్ ట్రాక్స్‌తో ఈ ఓ.యస్.టి. యూ ట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యాన్స్ నాన్‌స్టాప్‌గా వీటిని వింటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

'అతడు' చిత్రంలో మహేష్ బాబు, త్రిష (Trisha) మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. నాజర్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, సోనూ సూద్, సుధ, సునీల్ కీ-రోల్స్ ప్లే చేశారు. సీనియర్ నటుడు మురళీమోహన్ సమర్పణలో డి. కిషోర్, రామ్మోహన్ ఎమ్ నిర్మించిన 'అతడు' మూవీ మరోసారి కొత్త తరం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో సిద్ధమైంది. అయితే ఈ మూవీ వచ్చి 20 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఈసారి సెల‌బ్రేష‌న్స్ మోత‌మోగించాల‌ని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. రీ-రిలీజ్ లోనే కొత్త రికార్డులు సృష్టించి త‌మ హీరోకు 'అతడు'తో మరో గిఫ్ట్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారు. చూడాలి మ‌రి... ఈ రీ-రిలీజ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో...

Read Also: Hari Hara Veera Mallu: డిప్యూటీ సీఎం సినిమా అయినా అందరితో సమానమే

Read Also: Shah Rukh Khan: షూటింగ్‌లో డూప్ లేకుండా స్టంట్స్‌.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ షారుఖ్ ఖాన్

Updated Date - Jul 19 , 2025 | 04:22 PM