సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rishab Shetty :‘కాంతార’ క్రేజ్ ను నమ్మిన రిషబ్

ABN, Publish Date - Sep 26 , 2025 | 05:20 PM

కాంతారా హీరో పెద్ద రిస్క్ చేస్తున్నాడు. మొదటి పార్ట్ కు దక్కిన విజయంతో ఈసారి డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. కావాల్సినంత సంపాదించుకునే క్రేజ్ ఉన్నప్పటికీ తాను మాత్రం మరో రూట్ లో వెళ్తుండడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది.

'కాంతార’ (Kantara ) ఒక బ్లాక్‌బస్టర్ హిట్ అని చెప్పడం కన్నా, అది ఒక కల్ట్ ఫినామినన్ అని చెప్పాలి. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. రా ఎనర్జీ, గ్రిప్పింగ్ స్టోరీ, అదిరిపోయే సినిమాటోగ్రఫీతో ‘కాంతార’ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఈ భారీ విజయంతో 'కాంతార'కు 'ప్రీక్వెల్‌' (Prequel) ని తీసుకొస్తున్నారు‌. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.‌ ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అభిమానుల్లో హైప్‌ని మరింత పెంచేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి.. రెమ్యూనరేషన్ విషయంలో మరో డేరింగ్ స్టెప్ కూడా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.


రిషబ్ ఈసారి కేవలం దర్శకుడు, హీరోగానే కాదు, సినిమా నిర్మాణంలో కూడా తన సొంత డబ్బు పెట్టి రిస్క్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.‌అంటే పారితోషికం బదులు లాభాల్లో వాటా తీసుకున్నట్టుగా చెబుతున్నారు. మొదటి పార్ట్ కంటే ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకంతో ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

'కాంతార ప్రీక్వెల్‌' (Kantara Prequel)లో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కథానాయికగా చేస్తుండగా, గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) విలన్‌గా కనిపించనున్నాడు. జయరామ్ (Jayaram), రాకేశ్ పూజారి (Rakesh Poojari) లాంటి వాళ్లు సపోర్టింగ్ రోల్స్‌లో వచ్చి సినిమాకి మరింత బలం చేకూరుస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ (Hombale Films)పై విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) నిర్మించిన ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ ( Ajaneesh Loknath) మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా మరో బ్యాంగర్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా విడుదల కాబోతోంది.. ‘కాంతార’ లాంటి ఎమోషనల్ డెప్త్, కల్చరల్ రిచ్‌నెస్, యాక్షన్ ప్యాక్డ్ సీన్స్‌తో ఈ ప్రీక్వెల్ కూడా ప్రేక్షకులను థియేటర్స్‌లో మంత్రముగ్ధుల్ని చేస్తుందని ఆశిస్తున్నారు. రిషబ్ షెట్టి ఈ ప్రాజెక్ట్‌లో పూర్తి డెడికేషన్ చూపిస్తూ, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, ఇన్వెస్టర్‌గా అన్ని కోణాల్లోనూ తన సత్తా చాటుకోబోతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Also: OG Records: 'ఓజీ’ మొదటి కలెక్షన్స్ ఎంతో తెలుసా

Read Also: Avatar: Fire and Ash Trailer: విజువల్ వండర్ కా బాప్.. అదిరిపోయిన అవతార్ కొత్త ట్రైలర్

Updated Date - Sep 26 , 2025 | 05:56 PM