Avatar: Fire and Ash Trailer: విజువల్ వండర్ కా బాప్.. అదిరిపోయిన అవతార్ కొత్త ట్రైలర్

ABN , Publish Date - Sep 26 , 2025 | 03:53 PM

అవతార్ (Avatar) సినిమా గురించి కానీ, ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ( James Cameron) గురించి కానీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Avatar: Fire and Ash

Avatar: Fire and Ash Trailer: అవతార్ (Avatar) సినిమా గురించి కానీ, ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ( James Cameron) గురించి కానీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన టైటానిక్ నుంచి అవతార్ సినిమా వరకు ప్రపంచం మొత్తం సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అవతార్, అవతార్ 2 ఇప్పటికే రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించాయి. ఇక ఇప్పుడు అవతార్ ప్రాంఛైజీ నుంచి మూడో పార్ట్ రాబోతుంది. అదే అవతార్ ఫైర్ అండ్ యాష్.


సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా అవతార్ 3 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముందు రెండు పార్ట్స్ కంటే ఈ పార్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. కామెరూన్ ఈసారి కూడా సరికొత్త మాయ ప్రపంచంలోకి అభిమానులను తీసుకెళ్లడానికి సిద్దమయ్యాడు.


ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పండోరా ఓ లీలావన రత్నంలా కళ్లముందు మెరిసింది. ఒకప్పుడు నీలి నదులు, ఆకుపచ్చ అడవులతో ఒకరిపై ఒకరు ప్రేమ కురిపిస్తూ కనిపించిన ఈ లోకంలో ఇప్పుడు పొగలు చిమ్ముతున్నాయి... అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎప్పటిలాగే తమ జాతిని, పిల్లలను కాపాడుకోవడానికి జేక్‌ కుటుంబం, ఇప్పటికే అనేక యుద్ధాలు చవిచూసింది. సంతానం పెరిగింది, కానీ శత్రువులు మరింత శక్తిమంతంగా మారారు. అయినా కూడా వారందరితో ఈ జంట పోరాడడం చూపించారు.


ట్రైలర్ మొత్తం విజువల్ వండర్ గా కనిపిస్తుంది. ఈసారి కూడా కామెరూన్ మ్యాజిక్ చేయడానికి సిద్ధం అయ్యాడు. టోటల్ గా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఈ సినిమా ఈసారి ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Sriya Reddy - OG: ఉన్నతంగా ఆలోచించగలిగినప్పుడే అద్భుతాలు జరుగుతాయి..

OG Records: 'ఓజీ’ మొదటి కలెక్షన్స్ ఎంతో తెలుసా

Updated Date - Sep 26 , 2025 | 03:54 PM