OG Records: 'ఓజీ’ మొదటి కలెక్షన్స్ ఎంతో తెలుసా

ABN , Publish Date - Sep 26 , 2025 | 03:40 PM

పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన 'ఓజీ’ (OG) సినిమా గురువారం విడుదలైంది

పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన 'ఓజీ’ (OG) సినిమా గురువారం విడుదలైంది. హిట్టు సినిమా కోసం ఎంతో ఆకలిగా ఉన్న ఫ్యాన్స్‌ ఆకలి తీర్చేసారు పవన్.  'ఓజీ’  సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  మొదటి రోజు కలెక్షన్స్ (OG Collections) ఎంత అని అభిమానులు సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్నారు. దీనికి తాజాగా  చిత్ర బృందం స్పందించింది. 

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘ఇది పవన్‌ కల్యాణ్‌ సినిమా. చరిత్రను ఓజీ చెరిపేసింది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు మేకర్స్. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ((OG First Day Collectons)

Updated Date - Sep 26 , 2025 | 04:06 PM