Nazriya Nazim: టొవినో థామస్‌తో.. నజ్రియా రొమాన్స్

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:07 PM

కొంతకాలంగా అందరికీ దూరంగా ఉన్న నజ్రియా నజీమ్ ఇప్పుడు తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చింది. వరుసగా ప్రాజెక్టస్ కు సైన్ చేస్తూ బిజీ అవుతోంది. ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్న నజ్రియా తాజాగా టొవినో థామస్ సరసన ఓ మలయాళ చిత్రం చేయబోతోంది.

Nazriya Nazim

మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) గత కొంత కాలంగా లో-ప్రొఫెల్ ను మెయిటైన్ చేస్తూ వచ్చింది. గత యేడాది ఆమె నటించిన 'సూక్షదర్శిని' (Sookshmadarsini) అద్భుత విజయాన్ని అందుకుంది. అందుకు గాను ఆమె కేరళ ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా అవార్డుకూ ఎంపికైంది. అయితే కారణం చెప్పకుండానే సోషల్ మీడియాకు దూరమైపోయింది నజ్రియా. అనివార్య కారణంగా తాను మిత్రులకు, బంధువులకు, అభిమానులకూ దూరంగా ఉన్నానని, తన ఆవేదనను అర్థం చేసుకోమని కోరుతూ కొన్ని నెలల క్రితం నజ్రియా ఓ ఓపెన్ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆమెకు, ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కు మధ్య వైరం ఏదో జరిగిందని, వైవాహిక జీవితంలో పొరపొచ్చలు ఏర్పడ్డాయని చాలామంది భావించారు. అయితే వారిద్దరి మధ్య అనుబంధంలో ఎలాంటి తేడా లేదని ఇటీవల కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొని నిరూపించారు. అయితే నజ్రియా కొంత అనారోగ్యంతో బాధపడుతోందని, అందుకే నటనకు దూరంగా ఉంటూ ఒంటరి తనాన్ని కోరుకుంటోందని సన్నిహితులు తెలిపారు. నిదానంగా తిరిగి తన హెల్త్ ను సెట్ చేసుకున్న నజ్రియా ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తోంది.


విజయ్ షో రన్నర్ గా సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ది మద్రాస్ మిస్టరీ: ఫాల్ ఆఫ్‌ ఏ సూపర్ స్టార్' సీరిస్ లో నజ్రియా నజీమ్ కీలక పాత్రను పోషించింది. 1940 నాటి స్కాండల్ - డ్రైవెన్ పీరియడ్ థ్రిల్లర్ గా ఇది రూపుదిద్దుకుంది. ఇందులో నట్టి, శాంతన్ భాగ్యరాజా, నాజర్, వై.జి. మహేంద్రన్ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఇది సోనీ లివ్ (Sony liv) లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా నజ్రియా ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) సరసన నజ్రియా నటించబోతోంది. ముహ్సిన్ పరారి దర్శకత్వంలో ఈ సినిమాను ఏవీఏ సంస్థ నిర్మించబోతోంది. టొవినో, నజ్రియా జంటగా నటించడం ఇదే మొదటిసారి. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ చిత్రం ప్రేమకథతో రూపుదిద్దుకుంటోందట. 'రాజా రాణీ' అనువాద చిత్రంతో తెలుగువారికీ సుపరిచితురాలైన నజ్రియా.. నాని (Nani) మూవీ 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. దాంతో తెలుగు ప్రేక్షుకులు ఆమె అనువాద చిత్రాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నటనకు స్వస్తి పలుకుతుందేమోనని వారంతా భయపడుతున్న సమయంలో నజ్రియా... టొవినో థామస్ మూవీకి పచ్చ జెండా ఊపడం వారికి ఊరట కలిగించే అంశమే!

Also Read: Bandla Ganesh: అల్లు అర‌వింద్‌ను.. ఆడుకున్న బండ్ల గ‌ణేశ్‌! వీడియో వైర‌ల్‌

Also Read: Friday Tv Movies: శుక్ర‌వారం,Sep 19.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Sep 19 , 2025 | 01:02 PM

Tovino Thomas - 2018: ఉత్కంఠగా సాగే ‘2018’

Nazriya Nazim Fahadh: ఫహద్ రియాక్షన్ ఏమిటో...

Nazriya Nazim: పుష్ప 2లో 'ఫహద్' వన్ మ్యాన్ షో.. హీరోయిన్ లీక్ చేసేసింది

Tovino Thomas: నేను చూసిన తొలి తెలుగు సినిమా ఆయనదే!

Fahadh Faasil - Nazriya Nazim: ఫహాద్- నజ్రియా విడాకులు.. ఒక్క ఫొటోతో క్లారిటీ

Fahadh Faasil: సినిమాలు ఇక చాల్లే.. చూడలేకపోతున్నాం