Tovino Thomas - 2018: ఉత్కంఠగా సాగే ‘2018’

ABN , First Publish Date - 2023-05-01T13:01:08+05:30 IST

2018 కేరళ వరదల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘2018’. టొవినో థామస్‌(Tovino thomas), కుంచకు బొబన్‌, ఆసిఫ్‌ అలీ, అపర్ణా బాలమురళీ కీలక పాత్రధారులు.

Tovino Thomas - 2018: ఉత్కంఠగా సాగే ‘2018’

2018 కేరళ వరదల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘2018’. టొవినో థామస్‌(Tovino thomas), కుంచకు బొబన్‌, ఆసిఫ్‌ అలీ, అపర్ణా బాలమురళీ కీలక పాత్రధారులు. జుడ్‌ అంథోని జోసెఫ్‌ (Jude Anthany Joseph) దర్శకుడు. 2018లో కేరళ రాష్ట్రాన్ని (Kerala Floods) అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు, దాని వల్ల వాటిల్లిన నష్టం, కేరళ ప్రజలు పడిన ఇక్కట్లు, సహాయక చర్యలు ఇతివృత్తంగా (Disaster drama film) తీసుకుని దర్శకుడు సినిమాలా మలిచారు. హీరో టొవినో థామస్‌ ఈ చిత్రం విడుదల తేదీని ట్విట్టర్‌ వేదికగా మే 5న సినిమా విడుదల కానున్నట్లు ఆయన తెలిపారు. (Aparna Balamurali)

‘‘కేరళ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని విపత్తు ఇది. మహా ప్రళయాన్ని తట్టుకుని నిలబడ్డారు. పెను ప్రళయానికి ధైర్యంగా ఎదుర్కొన్న మలయాళీల ఐక్యతకు దృశ్యరూపం ఈ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది’’ అని అన్నారు దర్శకుడు. స్మాల్‌ స్కేల్‌ బడ్జెట్‌తో ఫ్యామిలీ డ్రామా సినిమాలు తీసే అంఽఽథోని జోసెఫ్‌ కెరీర్‌కి ఇది భారీ బడ్జెట్‌ చిత్రం. చిత్రీకరణకు అతి ఎక్కువ సమయం చిత్రమూ ఇదే. ప్రతి కేరళవాసి ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (2018 movie releasing on 5 may)

Updated Date - 2023-05-01T13:01:08+05:30 IST