Mythri Movie Makers: 'ఉప్పెన' బాటలో 'డ్యూడ్'....

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:13 PM

'డ్యూడ్' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడంపై మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హర్షం వెలిబుచ్చింది. ఆ మధ్య వచ్చిన తమ చిత్రం 'ఉప్పెన' సైతం ఇలానే వందకోట్ల గ్రాస్ సాధించిందని, కొత్తదర్శకులతో ఈ రేర్ ఫీట్ ను సాధించడం ఇది రెండోసారి అని నిర్మాతలు తెలిపారు.

Uppena - Dude Movies

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అధినేతలు నవీన్ ఎర్నేని (Naveen Erneni) , రవిశంకర్ (Ravishankar) కొత్త దర్శకులకు దన్నుగా నిలుస్తారనే విషయం మరోసారి రుజువైంది. అప్పట్లో వైష్ణవ్ తేజ్ (Vaishnava Tej), కృతిశెట్టి (Krithi Shetty) ని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 'ఉప్పెన' (Uppena) సినిమాను నిర్మించింది. ఆ మూవీతో బుచ్చిబాబు సానా (Buchchi Babu Sana) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కొత్త వాళ్ళతో తీసిన 'ఉప్పెన' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. సింగిల్ లాంగ్వేజ్ లోనే ఆ సినిమా ఆ రికార్డ్ ను సాధించడం విశేషం. ఓ కొత్త హీరో, హీరోయిన్ల సినిమా ఆ స్థాయి వసూళ్ళను గతంలో ఎప్పుడూ చేయలేదు. అయితే దానిని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఇప్పుడు అదే రికార్డ్ ను రిపీట్ చేసింది.


ప్రదీప్ రంగనాథన్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 'డ్యూడ్' మూవీని నిర్మించింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాతో కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. గతంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి 'లవ్ టుడే', 'డ్రాగన్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు 'డ్యూడ్' సైతం చక్కని విజయాన్ని అందుకుని అతనికి హ్యాట్రిక్ ను అందించింది. ఈ సినిమా ఇంతవరకూ వంద కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సైతం హర్షం వ్యక్తం చేసింది. 'ఉప్పెన' తర్వాత నూతన దర్శకుడితో తాము తీసిన 'డ్యూడ్' సైతం వందకోట్ల గ్రాస్ వసూలు చేయడం ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లోనూ కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని తెలిపింది.

Also Read: Tollywood: గంగాధర శాస్త్రి తండ్రి కాశీ విశ్వనాథ శర్మ కన్నుమూత

Also Read: Priyamani: రెమ్యునరేషన్‌, కాల్షీట్‌ విధానంపై ప్రియమణి ఏమన్నారంటే..

Updated Date - Oct 28 , 2025 | 01:13 PM

Dude Review: డ్యూడ్‌ మూవీ ఎలా ఉందంటే

Dude డ్రాగన్ కంటే.. నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ తో..

Dude: 'పునీత్ రాజ్ కుమార్'కి ప్రేమతో.. ఈ సినిమా అంకితం

Dude: డ్యూడ్ ట్రైల‌ర్‌తోనే అద‌ర‌గొట్టారుగా.. ప్ర‌దీప్ ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ గ్యారంటీ

Dude: ‘డ్యూడ్’ ఫస్ట్ సింగిల్.. ఏమిటో మాయ చేస్తోంది