Priyamani: రెమ్యునరేషన్‌, కాల్షీట్‌ విధానంపై ప్రియమణి ఏమన్నారంటే..

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:53 AM

సినిమా ఇండస్ట్రీలో మహిళల పారితోషికం విషయంలో తరచూ చర్చ నడుస్తూనే ఉంటుంది. హీరోలకు ఎక్కువ, హీరోయిన్‌లకు తక్కువ అనే కామెంట్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయంపై నటి ప్రియమణి (Priyamani) స్పందించారు.

Priyamani

సినిమా ఇండస్ట్రీలో మహిళల పారితోషికం విషయంలో తరచూ చర్చ నడుస్తూనే ఉంటుంది. హీరోలకు ఎక్కువ, హీరోయిన్‌లకు తక్కువ అనే కామెంట్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయంపై నటి ప్రియమణి (Priyamani) స్పందించారు. ‘నటిగా నేనెప్పుడూ రెమ్యునరేషన్‌కు (Remunaration Issue) ప్రాధాన్యం ఇవ్వలేదు. అది మనకున్న స్టార్‌డమ్‌ను బట్టి నిర్ణయిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకోనే నేను దర్శకనిర్మాతలను అడుగుతాను. నాతో పాటు నటించిన వారికంటే నేను తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఎప్పుడూ బాధపడలేదు. నా పాత్ర నిడివి,  నా నటన ఆధారంగా రెమ్యునరేషన్‌ ఇస్తారనే అవగాహన నాకుంది. నేను ఫలానా పాత్రకు అర్హురాలిని అని అనిపిస్తే డిమాండ్‌ చేస్తాను. అనవసరంగా రెమ్యూనరేషన్‌ పెంచమని అడగను’ అని చెప్పారు.


అలాగే టైమింగ్‌, కాల్షీట్‌ గురించి కూడా ఆమె మాట్లాడారు. ‘దక్షిణాది, ఉత్తరాదిలో ఇండస్ట్రీల్లో చిత్రీకరణ టైమింగ్‌ భిన్నంగా ఉంటాయి. సౌత్‌లో ఉదయం 8 గంటలకు షూటింగ్‌ స్టార్ట్‌ అని షెడ్యూల్‌ ఇస్తే కచ్చితంగా ఆ సమయానికి మొదలైపోతుంది. కానీ, నార్త్‌లో ఆ సమయానికి నటీనటులు ఇంటినుంచి బయల్దేరుతారు’ అని ప్రియమణి అన్నారు.



పెళ్లి తర్వాత సినిమాలకు కొంతగ్యాప్‌ ఇచ్చిన ప్రియమణి కొంతకాలం క్రితం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి  వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వెబ్‌ సిరీస్‌లులతో మెప్పిస్తున్నారు. అలాగే టీవీ షోల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తమిళంలో ‘ది గుడ్‌ వైఫ్‌’, మలయాళంలో ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ' తో ప్రేక్షకులను అలరించింది. కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ నటిస్తున్న ‘జన నాయగన్‌’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్‌ -3లోనూ నటిస్తున్నారు.  

Updated Date - Oct 28 , 2025 | 12:20 PM