Dude: డ్యూడ్ ట్రైలర్‌తోనే అదరగొట్టారుగా.. ప్రదీప్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:24 PM
ప్రదీప్ రంగనాధన్, మమితా బైజు జంటగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం డ్యూడ్.
ప్రదీప్ రంగనాధన్ (Pradeep Ranganathan), మమితా బైజు (Mamitha Baiju) జంటగా కీర్తిశ్వరన్ (Keerthiswaran) దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన చిత్రం డ్యూడ్. సాయి అభయంకర్ సంగీతం అందించాడు. నేహా శెట్టి, శరత్ కుమార్, రోహిణి, సత్య కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా ఆక్టోబర్ 17న సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌ను చూస్తే.. ఆరంభం నుంచి చివరి వరకు అంతా ప్రదీప్ ప్రదీప్ మయంగానే ఉంది. డైలాగ్స్, డెలివరీ, పంచులు, ఎమోషన్స్, ఫన్ అంతా అయన చుట్టూనే తిరుగుతూ ఓ రోలర్ కోస్టర్ రైడ్ సినిమా అనిపించేలా ఉంది. అశ్చర్యకరంగా ఇప్పటివరకు ఈ సినిమాలో టిల్లు రాధిక నేహా శెట్టి సైతం ఓ పాత్రలో నటిస్తున్న సంగతి తెలియక ఒక్క సారిగా ట్రైలర్లో కనినిపించే సరికి ప్రేక్షకులు షాకయ్యారు. అదేవిధంగా.. స్ట్రైయిట్‌గా యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రదీప్ మ్యానరిజమ్స్, సింగిల్ లైనర్స్ ఉన్నాయి.
'లైఫ్‌లో ఒక్క విషయాన్ని డీల్ చేస్తే.. లైఫ్ నిన్ను లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తుంది, ఎంట్రా నీ కథ ..పెళ్లంటే పిల్ల ఉండదు, పిల్ల ఉంటే పెళ్లి అవ్వదు ఏంట్రా ఇది, పక్కోడి ఫీలింగ్స్ క్రింజ్‌గా చూడడమే కదా ఇప్పుడు ట్రెండ్, ఫ్రెంట్‌లో పెట్టిన లెగ్గు బ్యాక్‌లో పెట్టినట్లు మన చరిత్రలోనే లేదు, ఈ బాడీ వేసుకుని గొడవలకు వెళుతున్నావే ఓ పది మంది వస్తే కొట్ట గలుగుతావా.. అంటే వంద మంది వచ్చినా కొట్టించుకోగలను, ఇక్కడ జరిగేది ఏది మన చేతులో లేదు.. దానిని నుంచి మనం ఏం నేర్చుకున్నామనేదే మన చేతిలో ఉంటుంది, బాగుంటే ఇద్దరి లైఫ్ బాగుండాలి లేకుంటే ఇద్దరం నాశనం కావాలి, తాళికి మర్యాద లేదు ఆ వెనకాల ఉన్న అమ్మాయికే మర్యాద' అంటూ అదిరిపోయే డైలాగులు కౌంటర్ డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా, మెస్మరైజింగ్‌గా ఉంది.
ట్రైలర్‌ను చూస్తే.. ప్రదీప్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనేలా ప్రామిసింగ్‌గా ఉందనడంలో సందేహాం ఏ మాత్రం లేదు. ఇక ట్రైలర్ ఎండింగ్‌లో ప్రదీప్, మమితల మధ్య కారులో వచ్చే ఎమోషనల్ సీన్, అందులో వారి ఎక్స్‌ప్రెషన్స్ అన్నింటికి మించి హైలెట్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కూడా.