సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anirudh : కూలీపై అనిరుధ్ రివ్యూ

ABN, Publish Date - Aug 12 , 2025 | 06:36 PM

సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ కంగారు పెట్టించాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ . చెప్పాల్సిన విష‌యాన్ని చెప్పకుండా స‌స్పెన్స్‌తో చంపేశాడు. ఎంత‌మంది ఎన్ని మాట‌లు చెప్పినా అనిరుధ్ చెప్పే ఆ విష‌యం కోసం క‌ళ్లలో వ‌త్తులు వేసుకుని చూశారు అభిమానులంతా.. ఫైన‌ల్‌గా అస‌లు విష‌యం చెప్పడంతో కూల్ అయ్యారంతా..

Anirudh-Coolie

ఇండ‌స్ట్రీలో కొన్నిసార్లు కొన్ని అల‌వాట్లు సెంటిమెంట్లుగా మారిపోతుంటాయి. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే చాలా క‌ష్టప‌డాల్సి వ‌స్తుంది. ఎప్పుడూ జ‌రిగిన‌ట్టే మ‌రోసారి జ‌ర‌గ‌క‌పోతే ఏదో ప్రమాదం ముంచుకొస్తుంద‌ని భ‌య‌ప‌డిపోతుంటారు. హీరోలైనా, ఫ్యాన్స్ అయినా దానికి అతీతం కాలేక‌పోతుంటారు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అలాంటి సిట్యువేష‌న్‌నే ఫేస్ చేయాల్సి వ‌చ్చింది.

అనిరుధ్ కామ‌న్‌గా తన మ్యూజిక్‌తో హిట్ కొట్టిన సినిమాల రిలీజ్‌కు ముందు సోష‌ల్ మీడియాలో ఫైర్, అలాగే కప్ ఎమోజీలను పెట్టి రివ్యూ ఇచ్చేవాడు. కానీ, ఇటీవల ఈ రాక్‌స్టార్ తన ఎమోజీ రివ్యూలను ఆపేశాడు. ఇదే క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీకి అనిరుధ్ ఎమోజీ రివ్యూ ఇవ్వక‌పోడం ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టించింది. అనిరుద్‌కు కూలీ సక్సెస్‌పై నమ్మకం లేదా అని చాలామంది డౌట్ పడ్డారు. కానీ, అనిరుద్ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఈ ఊహాగానాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు.


ముంబైలో నిలీ హిందీ వెర్షన్ ఆడియో ఆల్బమ్ కోసం జరిగిన స్పాటిఫై ఈవెంట్‌లో అనిరుద్ లైవ్‌లో ఎమోజీ రివ్యూ ఇచ్చాడు. కూలీకి 10 కప్స్, 10 ఫైర్స్ ఏమోజీలు ఇస్తాన‌ని చెప్పి రజనీ ఫ్యాన్స్‌ను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లాడు. అనిరుద్ ఈ లైవ్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ రివ్యూ ఆపేయ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయ‌ని గ‌తంలోనే చెప్పాడు అనిరుధ్. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావని నాకు ముందే తెలుసని, అలాంటప్పుడు వాటిని హైప్ చేయడం కరెక్ట్ కాదని, అది త‌న‌పై అదనపు ప్రెషర్ కూడా తెచ్చిపెడుతుందని, అందుకే ఎమోజీ రివ్యూలు ఆపేసిన‌ట్టు రివీల్ చేశాడు. కానీ కూలీ మాత్రం త‌న‌కు ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఇచ్చింద‌ని, ఫ్యాన్స్ ఎన్ని ఫైర్స్, కప్స్ పెట్టుకున్నా సరిపోదని డిక్లేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ALSO READ: Monica Bellucci: మోనికా సాంగ్ చూసి మోనికా బెలూచి ఏమన్నదంటే..

Kantara: Chapter 1: కాంతారా ఛాప్టర్‌ 1.. ప్రమాదాలు.. నిర్మాత క్లారిటీ

Pooja Hegde : పెయిడ్ ట్రోలింగ్‌పై పూజా షాకింగ్ కామెంట్స్

Updated Date - Aug 12 , 2025 | 07:27 PM