Monica Bellucci: మోనికా సాంగ్ చూసి మోనికా బెలూచి ఏమన్నదంటే..

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:13 PM

మోనికా.. మోనికా.. మై డియర్ మోనికా అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది కూలీ (Coolie) సాంగ్. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

Coolie

Monica Bellucci: మోనికా.. మోనికా.. మై డియర్ మోనికా అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది కూలీ (Coolie) సాంగ్. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ మొత్తం దింపేశాడు లోకేష్. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ లాంటి స్టార్స్ నటించారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం శివ కార్తికేయన్ క్యామియో పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే కూలీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక కూలీకి ఒక హైప్ ఇచ్చింది మాత్రం మోనికా సాంగ్. పూజా హెగ్డే స్పెషల్ గా నటించిన ఈ సాంగ్ లో సౌబిన్ షాహిర్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ కు ఫిదా అయ్యారు. అసలు ఇప్పటివరకు అతని డ్యాన్స్ చూడని అభిమానులు ఒక్కసారిగా ఆయన డ్యాన్స్ చూసి షాక్ అయ్యారు. ఇక ఈ సాంగ్ ను లోకేష్ పెట్టడానికి కారణం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


ఇటాలియన్ లెజెండరీ బ్యూటీ మోనికా బెలూచి అంటే లోకేష్ కు చాలా ఇష్టమని, ఆమెపై ఉన్న ఇష్టం గురించి అనిరుధ్ కి చెప్పడంతో మోనికాకు ట్రిబ్యూట్ గా ఈ సాంగ్ చేశామని, అది ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక మోనికాకు తగ్గట్లుగా పూజా అందంతో అదరగొట్టేసింది. అయితే ఈ సాంగ్ చివరకు మోనికా బెలూచి వద్దకు కూడా వెళ్ళింది. బాలీవుడ్ ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


మోనికాకు పరిచయం ఉన్న ఒక ఫిల్మ్ హెడ్ కు అనుపమ మోనికా సాంగ్ ను షేర్ చేసిందట. ఆ సాంగ్ విని మోనికా కూడా తనకు బాగా నచ్చిందని తిరిగి మెసేజ్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ మాట వినడంతో పూజా హెగ్డే సంభ్రమాశ్చర్యాలకు గురైంది. సెట్ లో అందరితో పాటు తనకు కూడా మోనికా అంటే చాలా ఇష్టమని, ఆమె ఈ సాంగ్ నచ్చింది అని చెప్పడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పూజా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కూలీ సినిమా విజయానికి మోనికా బెలూచి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Janhvi Kapoor: రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అల్లు అర్జున్‌.. జాన్వీ ఇమిటేషన్ ఇరగదీసింది

War 2 - Coolie: సినీ అభిమానుల ఆవేదన

Updated Date - Aug 12 , 2025 | 04:13 PM