Kantara: Chapter 1: కాంతారా ఛాప్టర్ 1.. ప్రమాదాలు.. నిర్మాత క్లారిటీ
ABN, Publish Date - Aug 12 , 2025 | 05:38 PM
కాంతారా ఛాప్టర్ 1 సినిమా మొదలైనప్పటి నుంచి వివిధ కారణాలు, ప్రమాదాలతో షూటింగ్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటి నుంచి శాండల్‌వుడ్‌లో ఈ సినిమా గురించి టాపిక్ మొదలైంది. ఈ ప్రమాదాలకు, మరణాలకు కారణమేంటి? ఇదేమైనా శాపమా..
కన్నడ చిత్రం ‘కాంతారా’ (kantara) చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. అంతే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జాతీయ పురస్కారం దక్కించుకుంది. దీనికి ప్రీక్వెల్‌గా నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి ‘కాంతారా: చాప్టర్1’ (kantara chapter 1) తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి వివిధ కారణాలు, ప్రమాదాలతో షూటింగ్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పటి నుంచి శాండల్‌వుడ్‌లో ఈ సినిమా గురించి టాపిక్ మొదలైంది. ఈ ప్రమాదాలకు, మరణాలకు కారణమేంటి? ఇదేమైనా శాపమా? అంటూ కన్నడ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. దీనిపై చిత్ర నిర్మాత చలువే గౌడ (Chaluve gowda) మాట్లాడారు. ‘కాంతారా: ఛాప్టర్-1’ మొదలైన తర్వాత దురదృష్టవశాత్తూ చోటు చేసుకున్న సంఘటనలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. సెట్‌లో ఒకసారే అగ్ని ప్రమాదం జరిగింది. మిగిలిన ప్రమాదాలు, మరణాలు సినిమాకు సంబంధం లేనివి. గతేడాది నవంబరులో కర్ణాటక లోని కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడింది. అలాగే 2025 జనవరిలో సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత రిషబ్ శెట్టి సహా కొంతమంది టీమ్ సభ్యులు త్రుటిలో పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెమెరాలు, ఇతర ఎక్విప్‌మెంట్ నీట మునిగిపోయాయి’ అని అన్నారు.
ALSO READ: Anirudh : కూలీపై అనిరుధ్ రివ్యూ
‘ఏ పని ప్రారంభించిన దేవుడిని తలుచుకునే చేస్తాం. మనమంతా దేవుడి పట్ల భయం, భక్తితో ఉంటాం. రోజూ పూజ చేస్తాం. ఏ పని చేసినా దేవుడి ఆశీస్సులు ఉండాలని మొక్కుతాం. ‘కాంతారా: చాప్టర్1’ ప్రకటన చేసే ముందే మా టీమ్ అంతా పంజుర్లిని కలిసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుంది? అని అడిగాం. ‘కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పారు. మేము ఎక్కువగా దట్టమైన అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశాం. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, నాలుగు గంటలకల్లా రెడీ అయి, షూటింగ్ లొకేషన్‌కు వెళ్లిపోయే వాళ్లం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకు చిత్రీకరణ మొదలయ్యేది. 80 శాతం సినిమాను రియల్ లొకేషన్స్‌లో తెరకెక్కించాం. ఆ షూటింగ్ లొకేషన్స్ అన్నీ నగరానికి వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి తోడు వాతావరణం ఇబ్బంది పెడుతూనే ఉండేది. టైమ్ వేస్ట్ కాకూడదని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను వర్షంలోనే తీశాం. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయితే, దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయలేం. కానీ, వచ్చి ఫుటేజ్ చూసిన తర్వాత మేము సమయాన్ని వృథా చేయలేదనిపించింది’ అని అన్నారు. రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ALSO READ: Monica Bellucci: మోనికా సాంగ్ చూసి మోనికా బెలూచి ఏమన్నదంటే..
Kantara: Chapter 1: కాంతారా ఛాప్టర్ 1.. ప్రమాదాలు.. నిర్మాత క్లారిటీ
Pooja Hegde : పెయిడ్ ట్రోలింగ్‌పై పూజా షాకింగ్ కామెంట్స్