సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sandalwood: డేంజర్ బాయ్స్ వచ్చేస్తున్నారు...

ABN, Publish Date - May 24 , 2025 | 05:14 PM

ఈ మధ్య కాలంలో కన్నడ నుండి తెలుగులోకి డబ్ అవుతున్న సినిమాల సంఖ్య నిదానంగా పెరగుతోంది. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కంటెట్ ప్రధానమైన చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.

కన్నడలో మంచి విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించిన 'అపాయవీడి హెచ్చరిక' (Apayaveedi Hechcharike) చిత్రం తెలుగులో 'డేంజర్ బాయ్స్' (Danger Boys) పేరుతో డబ్ అవుతోంది. యశశ్విని క్రియేషన్స్ - గీతా ఫిలిమ్స్ పతాకాలపై శ్రీరంగం సతీష్ కుమార్ (Srirangam Satish Kumar) సమర్పణలో వి. జి. మంజునాథ్, పూర్ణిమ ఎమ్. గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి అభిజిత్ తీర్ధహళ్లి (Abhijith Teerthahalli) రచన చేసి, డైరెక్షన్ చేశారు.


వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ప్రధాన పాత్రలు పోషించి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఒక్కరే కావడం గమనార్హం. సునాద్ గౌతమ్ (Sunad Gautam) మ్యూజిక్, సినిమాటోగ్రఫీ 'డేంజర్ బాయ్స్' చిత్ర సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించాయి. కన్నడలో మాదిరే ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర సమర్పకులు, ప్రముఖ దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జూన్ ద్వితీయార్థంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న 'డేంజర్ బాయ్స్' ప్రీ-రిలీజ్ వేడుక జూన్ 1న హైదరాబాద్ లో జరుగబోతోంది.

Also Read: Nilave: నిజాయితీతో చేసిన సినిమా...

Also Read: Kollywood: చియాన్ విక్రమ్ సరసన మీనాక్షి చౌదరి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 24 , 2025 | 05:17 PM