Kollywood: చియాన్ విక్రమ్ సరసన మీనాక్షి చౌదరి

ABN , Publish Date - May 24 , 2025 | 04:17 PM

కథానాయికగా తెలుగులో చక్కని గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ఇప్పటికే మూడు తమిళ చిత్రాలలో నటించింది. అయితే అవేవీ ఆమెకు గొప్ప విజయాన్ని అందించలేదు. ఆ లోటును తీర్చుతూ ఇప్పుడు విక్రమ్ మూవీలో ఆఫర్ ను దక్కించుకుంది మీనాక్షి చౌదరి.

అందాల భామ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ... హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి నాలుగేళ్ళు గడిచిపోతోంది. సుశాంత్ (Sushanth) 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పరాజయం పాలైనా... మీనాక్షి చౌదరికి ఆఫర్స్ బాగానే వచ్చాయి. రవితేజ (Raviteja) 'ఖిలాడీ', అడివి శేష్ (Adivi Sesh) హిట్: ది సెకండ్ కేస్' చిత్రాలను ఆ తర్వాత సంవత్సరం చేసింది. ఆ తర్వాత సంవత్సరమే మీనాక్షి చౌదరి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ ఆంటోనీ మూవీ 'కోలై'లో ఆమెకు ఛాన్స్ దక్కింది. ఆ సినిమా 'హత్య' పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. గత యేడాది సంక్రాంతికి వచ్చిన మహేశ్ బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరికి ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రను మేకర్స్ ఇచ్చారు. అయితే దానికి ప్రతిఫలంగా సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'లో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. అలానే ఈ బ్యానర్ నుండే వస్తున్న 'అనగనగా ఒక రాజు'లోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది. నాగచైతన్య 24వ చిత్రంలోనూ మీనాక్షి చౌదరే హీరోయిన్. ఇదిలా ఉంటే లాస్ట్ ఇయర్ మీనాక్షి నటించిన, 'మట్కా', 'మెకానిక్ రాకీ' చిత్రాలు ఆమెను నిరాశకు గురిచేశాయి. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ అఖండ విజయాన్ని సాధించి, మీనాక్షి చౌదరికి గొప్ప ఊరటను కలిగించింది.


విశేషం ఏమంటే.. 2023లో 'కోలై'తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి శేషాద్రి లాస్ట్ ఇయర్ 'సింగపూర్ సెలూన్', 'గోట్' చిత్రాలలో నటించింది. అయితే ఇవేవీ ఆమెకు వృత్తిపరమైన సంతృప్తిని అందించలేదు. కమర్షియల్ గానూ ఇవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చియాన్ విక్రమ్ (Vikram) సరసన అమ్మడు చోటు దక్కించుకుంది. 'మండేలా' (Mandela), 'మావీరన్' (Maaveeran) చిత్రాల దర్శకుడు మడోన్నే అశ్విన్ (Madonne Ashwin) తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఈ సినిమాతో అయినా మీనాక్షికి చౌదరికి కోలీవుడ్ లో గ్రాండ్ విక్టరీ లభిస్తుందేమో చూద్దాం.

Also Read: Ravi Mohan: రోజుకో మలుపు తిరుగుతున్న విడాకుల వ్యవహారం

Also Read: Tollywood: సమస్యల పరిష్కారానికి కమిటీ... థియేటర్స్ బంద్ ఉండదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 24 , 2025 | 04:26 PM