Nilave: నిజాయితీతో చేసిన సినిమా...

ABN , Publish Date - May 24 , 2025 | 04:49 PM

ప్రస్తుతం ఇద్దరు దర్శకులు కలిసి ఒక సినిమా చేయడమనేది ఎక్కువ అయ్యింది. ఆ కోవలోకి వచ్చే సినిమానే 'నిలవే'. ఈ మూవీని సౌమిత్ రావు, సాయి వెన్నం డైరెక్ట్ చేస్తున్నారు.

సౌమిత్ రావు (Sowmith Rao), శ్రేయాసి సేన్ (Shreyansi Sen) జంట‌గా న‌టించిన ‘నిలవే’ (Nilave) చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు. తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రంలోని పాత్రల్ని పరిచయం చేశారు. సంతోషం, నమ్మకం, అలక, పిలుపు అంటూ అన్ని రకాల ఎమోషన్స్‌కు సంబంధించిన ‘నిలవే’ పోస్టర్‌లను రిలీజ్ చేశారు. అనంతరం హీరో సౌమిత్ రావు మాట్లాడుతూ 'ఇదో మంచి మ్యూజికల్ లవ్ డ్రామా. ఎంతో నిజాయితీతో ఈ మూవీని చేశాం. మా సినిమా బాగుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిజాయితీకి అర్థం ఉంటే అదే సినిమా’ అని అన్నారు.


దర్శకుడు సాయి వెన్నం మాట్లాడుతూ, ‘మా పేర్లు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. మాది చిన్న టీం కావొచ్చు. కానీ మా కాన్సెప్ట్, మా సినిమా చాలా పెద్దగా ఉంటుంది. ఇదొక అందమైన ప్రేమ కథ. ఓ వ్యక్తి జీవితంలో జరిగే ప్రయాణమే ‘నిలవే’. మ్యూజిక్‌ని లవ్‌తో చూపించాలని అనుకున్నాం. మేం కథ పైన ప్రేమతో ఎంతో కష్టపడి ‘నిలవే’ చిత్రాన్ని తీశాం. టీజర్ చూస్తే నిజాయతీగా ఉంటుంది. ఎక్స్‌పోజింగ్ లేదని, డైలాగుల్లో బూతులు లేవని, వైరల్ అవ్వదని చాలా మంది చెప్పారు. కానీ మా కంటెంట్ మాత్రమే చెప్పాలని టీజర్ కట్ చేశాం. ‘నిలవే’ చాలా మంచి సినిమా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, కెమెరామెన్ దిలీప్ కె కుమార్, లిరిక్ రైటర్ ఎం.వి.ఎస్. భరద్వాజ్, కోటి తదితరులు మాట్లాడారు. ఈ సినిమాలో సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Also Read: Kollywood: చియాన్ విక్రమ్ సరసన మీనాక్షి చౌదరి

Also Read: Ravi Mohan: రోజుకో మలుపు తిరుగుతున్న విడాకుల వ్యవహారం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 24 , 2025 | 04:54 PM