Kotha Lokah: కళ్యాణీ ప్రియదర్శన్ కొత్త సినిమా
ABN, Publish Date - Nov 20 , 2025 | 01:59 PM
'లోక' చిత్రం తర్వాత కళ్యాణీ ప్రియదర్శన్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆమెతో సినిమాలు నిర్మించడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ పొటెన్షియల్ స్టూడియోస్ కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా కొత్త సినిమాను ప్రారంభించింది.
కళ్యాణీ ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)... ఇవాళ మలయాళ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్. అగ్ర కథానాయకుల సినిమాలను మించి పోయి... ఆమె నటించిన 'లోకా' (Lokah) పార్ట్ వన్ మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. దీంతో ఒక్కసారిగా సెట్స్ మీద ఉన్న ఆమె సినిమాలకు క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం కార్తీ (Karthi) సరసన 'మార్షల్' సినిమాలోనూ, 'జయం' రవి (Jayam Ravi) 'జీనీ'లోనూ ఆమె నటిస్తోంది. అలానే 'లోకా' మూవీ సక్సెస్ తర్వాత కళ్యాణీ ప్రియదర్శన్ తో సినిమా తీయడానికి చాలామంది మేకర్స్ తహతహలాడుతున్నారు.
ఇదిలా ఉంటే... పొటెన్షియల్ స్టూడియోస్ సంస్థ తన ఏడో సినిమాను కళ్యాణ్ ప్రియదర్శన్ తో మొదలు పెట్టింది. గతంలో 'మాయ, మానగరం, మాన్ స్టర్, తానక్కరన్, ఇరుగపాత్రు, బ్లాక్' వంటి విజయవంతమైన సినిమాలను ఈ నిర్మాణ సంస్థ రూపొందించింది. ఈ సినిమాలో 'నాన్ మహానల్లా' ఫేమ్ దేవదర్శిని, వినోద్ కిషన్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ మూవీతో ధీరవియం ఎస్.ఎన్. దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రవీణ్ భాస్కర్, శ్రీకుమార్ దీనికి దర్శకుడితో కలిసి స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, పి. గోపీనాథ్, తంగప్రభహరన్ ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
Also Read: Ilaiyaraja-Yuvan: తండ్రీకొడుకుల అద్భుత సంగీత కలయిక
Also Read: Ajay Bhupathi: జయకృష్ణ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం