Naslen: 'కొత్త లోక'గా రాబోతున్న మలయాళ చిత్రం 'లోకా'
ABN, Publish Date - Aug 23 , 2025 | 10:25 AM
ఈ యేడాది ఓనమ్ సీజన్ లో నటి లిజి, దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarsan) నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు వస్తున్నాయి.
కేరళలో ఓనమ్ సందడి నెలకొంది. ప్రతి యేడాదిలానే ఈ సారి కూడా ఓనమ్ సందర్భంగా పలు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడుతున్నాయి. విశేషం ఏమంటే ఈ యేడాది నటి లిజి, దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarsan) నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు వస్తున్నాయి.
అందులో ఒకటి 'లోకా చాప్టర్ 1: చంద్ర' (Lokah Chapter 1: Chandra). 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ (Naslen) కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన వేఫరార్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డామ్నిక్ అరుణ్ (Dominic Arun) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓనమ్ కానుకగా సెప్టెంబర్ మొదటివారంలో విడుదల చేస్తామని మేకర్స్ గతంలో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. ఆగస్ట్ 28న ఈ సినిమా విడుదల కాబోతోంది.
విశేషం ఏమంటే... ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ 'కొత్త లోక' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా మొత్తం ఐదు భాషల్లో జనం ముందుకు రాబోతోంది. ఇక కళ్యాణీ ప్రియదర్శన్ నటించిన మరో సినిమా 'ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర' కూడా ఓనమ్ కే వస్తోంది. అయితే ఈ సినిమా ఆగస్ట్ 29న రిలీజ్ అవుతోంది. ఇందులో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించాడు. అదే రోజున 'మైనే ప్యార్ కియా' మూవీ కూడా విడుదల కాబోతోంది.
ఇక ఓనమ్ కానుకగా ఆగస్ట్ 28న రాబోతున్న 'లోకా చాప్టర్ 1: చంద్ర' మూవీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) సినిమా 'హృదయపూర్వం' (Hridayapoorvam) తో పోటీ పడబోతోంది. సత్యన్ అంతికడ్ రూపొందించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్ కీ-రోల్ ప్లే చేసింది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. మోహన్ లాల్, దర్శకుడ సత్యన్ దాదాపు పదేళ్ళ తర్వాత తిరిగి ఈ సినిమాకు వర్క్ చేశారు. 2015లో చివరగా వీరిద్దరి కాంబోలో 'ఎన్నుమ్ ఎప్పెళుమ్' సినిమా వచ్చింది. ఈ మీడియం బడ్జెట్ మూవీలో ఇతర ప్రధాన పాత్రలను సంగీత్ ప్రతాప్, సంగీత, సిద్థిక్, లాలు అలెక్స్, జనార్దన్, బాబూ రాజ్ తదితరులు పోషించారు. మరి ఓనమ్ సీజన్ లో వస్తున్న సినిమాల్లో ఏవేవి జనాలను ఆకట్టుకుంటాయో చూడాలి.
Also Read: Yandamuri: సంబంధంలేని విషయాల్లో చిరంజీవి వేలు పెట్టరు...
Also Read: Saturday Tv Movies: శనివారం, ఆగస్టు 23.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా