Nayagan Case: ‘నాయగన్ స్టోరీ.. సీన్ బై సీన్ చెప్పగలను! హైకోర్టు న్యాయమూర్తి
ABN, Publish Date - Nov 08 , 2025 | 09:45 AM
కమల్‌హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన 'నాయగన్' సినిమా రీ రిలీజ్‌పై స్టే విధించలేమని ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన 'నాయగన్' సినిమా రీ రిలీజ్‌పై స్టే విధించలేమని ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి ఆ మూవీ తనకు బాగా నచ్చిందని, ఇప్పటికీ ఆ చిత్ర కథను సీన్‌బై సీన్‌గా చెప్పగలనని వ్యాఖ్యానించారు. 1987లో రిలీజైన ఈ మూవీ ద్వారా శరణ్యా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రం ద్వి శతదినోత్సవాన్ని కూడా జరుపుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి మరిన్ని కొత్త మెరుగులతో తీర్చిదిద్ది కమల్‌హాసన్ బర్త్‌డే సందర్భంగా గురువారం రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ లోగా మూవీ రీ రిలీజ్‌పై స్టే విధించాలని కోరుతూ ఎస్‌ఆర్ ఫిలిమ్ ఫ్యాక్టరీ యజమాని ఎస్‌ఆర్ రాజన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. నాయకన్ చిత్రం రిలీజ్ హక్కులు తమ సంస్థకే ఉన్నప్పుటికీ, వీఎస్ ఫిలిమ్స్ అక్రమంగా పొరుగు రాష్ట్రాల్లోనూ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. (Nayagan Re Release)
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఎన్.సెంథిల్‌కుమార్ ఆ మూవీ రిలీజ్‌ను నిలుపుదల చేస్తూ స్టే విధించలేమని ప్రకటించారు. ఒప్పంద ప్రాతిపదికగానే ఈ మూవీ విడుదల చేస్తుండటం వల్ల స్టే విధించాల్సిన అవసరం లేదన్నారు. అంతే కాకుండా ‘నాయగన్’ మూవీని తాను 16 సార్లు చూశానని, ఇప్పటికీ ఆ మూవీ స్టోరీ తనకింకా గుర్తుందని, ,ఆ స్టోరీ సీన్‌బై సీన్‌గా చెప్పగలనని న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ పేర్కొన్నారు. జనకరాజ్, నాజర్, ఢిల్లీ గణేష్, నిళల్‌గళ్ రవి, విజయన్, ఎంవీ వాసుదేవరావ్, రాజా కృష్ణమూర్తి, టినూ ఆనంద్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ALSO READ: Nandita swetha: ఒక సినిమా హిట్ అయితే.. అలా అనుకోకూడదు
Akhanda 2: అఖండ తాండవం ప్రోమో వచ్చేసిందిరోయ్..