Nandita swetha: ఒక సినిమా హిట్ అయితే.. అలా అనుకోకూడదు  

ABN , Publish Date - Nov 08 , 2025 | 09:17 AM

నటి నందిత శ్వేతా తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు, కన్నడ  సినిమాలతోను అలరిస్తోంది.  కొత్తగా వెబ్‌ సిరీస్ ల్లో  నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

నటి నందితా శ్వేత (Nanditha Swetha) ‘అట్టకత్తి’ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమై ‘ఎదిర్‌నీచ్చల్‌’; ‘ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా’, ‘ముండాసుపట్టి’, ‘అసురవధం’, ‘కపటధారి’, ‘రత్తం’, ‘రణం’ తదితర చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. కొత్తగా వెబ్‌ సిరీస్ ల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు తన సినీ జైత్రయాత్రను గురించి ఆ బ్యూటీ మీడియాతో ముచ్చటించారు. సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుండి సినిమాలు చూడటం అలవాటని చెబుతూ ఎవరైనా లక్ష్యం ఏమిటని అడిగితో సినిమాల్లో నటించడమేనని టక్కున బదులిచ్చేదానినన్నారు. 

Nanditha.jpg

సినిమాల్లో ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఓ మూవీ హిట్‌కొడితే మనమే పెద్ద స్టార్‌లమని గర్వపడకూడదని తెలిపింది. ఒకే మూవీతో ఎవరూ కోటీశ్వరులు కాలేరని, అంచెలంచెలుగా మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తేనే టాప్‌ పొజిషన్‌కు వస్తారని చెబుతోంది.. ఫస్ట్‌మూవీలో నటించాక మూడేళ్లు చదివేందుకు వెళ్ళిపోయానని, కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత తొలిసారిగా నటించిన తమిళ మూవీయే ‘అట్టకత్తి’ అని చెప్పింది. సినిమాల్లో తాను నేర్చుకున్న పాఠం ఏమిటంటే ఓర్పుగా ఉండటమేనని నవ్వుతూ తెలిపింది. స్టోరీకి అవసరమయితే గ్లామరస్‌ పాత్రలో నటించేందుకు కూడా తాను రెడీ అని నందితా శ్వేతా స్పష్టం చేసింది.

ALSO READ: Nayagan Case: ‘నాయగన్‌ స్టోరీ సీన్‌ బై సీన్‌ చెప్పగలను.. హైకోర్టు న్యాయమూర్తి

Akhanda 2: అఖండ తాండవం ప్రోమో వచ్చేసిందిరోయ్..

Updated Date - Nov 08 , 2025 | 10:36 AM